Health Tips: టొమాటో ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఇలాంటి వారు దూరంగా ఉండటం మంచిది
మనం రోజూ తినే కూరగాయల్లో టొమాటో ఒకటి . ఇది మనిషి యవ్వనాన్ని కాపాడుతుంది. ఎందుకంటే టొమాటో సరైన జీర్ణక్రియను నిర్వహిస్తుంది. ఇది అనేక కడుపు..
మనం రోజూ తినే కూరగాయల్లో టొమాటో ఒకటి . ఇది మనిషి యవ్వనాన్ని కాపాడుతుంది. ఎందుకంటే టొమాటో సరైన జీర్ణక్రియను నిర్వహిస్తుంది. ఇది అనేక కడుపు సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది. టొమాటోలో విటమిన్ ఎ, సి ఉంటాయి. వీటిలో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి , స్టార్చ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అదనంగా ఇందులో పొటాషియం, మెగ్నీషియం, క్రోమియం, కోలిన్, ఫోలేట్, ఐరన్, జింక్, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉంటాయి. అందుకే టొమాటో తినడం వల్ల మనం రకరకాల పోషకాలను పొందవచ్చు. అయితే కొంతమంది మాత్రమే టమోటాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.
టమోటాలు ఎవరు తినకూడదు?
కిడ్నీ ఫెయిల్యూర్, డయాలసిస్ రోగులు, కిడ్నీ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులు టమోటాలు తినకూడదు. టొమాటోలు రోజువారీ ఆహారంలో భాగమైనప్పటికీ, కిడ్నీలో రాళ్లను నివారించడానికి టమోటాలు తినవచ్చు. కానీ పదే పదే కిడ్నీ స్టోన్ వస్తుంటే టొమాటో తినకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.
టమోటాలు ఎవరైనా తినవచ్చు:
చర్మపు పుండు, తరచుగా చర్మం రంగు మారడం, నిరంతర అల్సర్‌లతో బాధపడేవారు టొమాటోలను ఎక్కువగా తీసుకోవచ్చు. విటమిన్ ఎ లోపం, కంటి సమస్యలు ఉన్నవారు టమోటాలను క్రమం తప్పకుండా తినవచ్చు. టొమాటో హృద్రోగులకు, బైపాస్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. టొమాటో అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
టొమాటో ప్రయోజనాలు:
టొమాటోలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన దంతాలు, చిగుళ్ళు , చర్మంలో సహాయపడుతుంది. టమాటాలోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీర కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. టొమాటో గుండె జబ్బులకు చాలా మంచిది. రక్త నాళాల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్త ప్రసరణను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఒక వ్యక్తి ఎన్ని టమోటాలు తినవచ్చు?
ఒక వ్యక్తి రోజుకు 300 నుండి 400 గ్రాముల కూరగాయలు తినాలి. టొమాటోలను 100 గ్రాముల వరకు తినవచ్చు. ఇది రెండు టమోటాలకు సమానం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి