Drumstick Leaves: మధుమేహ వ్యాధిగ్రస్తులపాలిట దివౌషధం మునగాకు రసం.. ప్రతి రోజూ దీనిని తాగారంటే..

|

Jul 12, 2022 | 12:19 PM

మునక్కాయలు రుచికేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలిసిన విషయే. ఐతే.. మునగ పువ్వులు, ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలుంటాయని మీకు తెలుసా! అందుకే మనగను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. మునగ ఆకులతో తయారుచేసిన..

Drumstick Leaves: మధుమేహ వ్యాధిగ్రస్తులపాలిట దివౌషధం మునగాకు రసం.. ప్రతి రోజూ దీనిని తాగారంటే..
Drumstick Leaves Juice
Follow us on

Health Benefits of Drumstick Leaves Juice: మునక్కాయలు రుచికేకాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలిసిన విషయే. ఐతే.. మునగ పువ్వులు, ఆకుల్లో కూడా ఎన్నో పోషకాలుంటాయని మీకు తెలుసా! అందుకే మనగను సూపర్‌ఫుడ్‌గా పిలుస్తారు. మునగ ఆకులతో తయారుచేసిన పరాటా ఎంతో రుచిగా ఉంటుంది. మునగ ఆకుల రసంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిలో మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం, ప్రొటీన్, విటమిన్ ఎ, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రసం తాగితే అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం..

మధుమేహం వ్యాధిగ్రస్తులకు 
మునగ ఆకుల రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఐతే చక్కెర వ్యాధిగ్రస్తులు మునగ ఆకుల రసాన్నిసేవించడానికి ముందు వైద్యుడిని సంప్రదించడం తప్పనిసరి.

బరువు తగ్గటానికి
బరువు తగ్గించడంలో మునగ ఆకులు కూడా సహాయపడతాయి. ఈ ఆకుల్లో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు ఉన్నాయి. మునగ ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల వేగంగా బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

రక్తాన్ని శుద్ధి చేస్తుంది
మునగ ఆకుల రసం రక్తాన్ని శుభ్రం చేస్తుంది. శరీరంలోని హానికారక టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

పొట్ట ఆరోగ్యం
కడుపు నొప్పి, కడుపు పూతలకి మునగ ఆకుల రసం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బరువు సంబంధిత సమస్యలను కూడా నివారిస్తుంది.

ఎముకలను దృఢంగా చేస్తుంది
మునగలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇందులో మెగ్నీషియం, కాల్షియం మరియు ఫాస్పరస్ ఉంటాయి. ఇది ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడుతుంది. దీని రసం ఆస్టియోపోరోసిస్ సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.

గుండె ఆరోగ్యానికి
మునగ ఆకుల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.

అధిక రక్తపోటు అదుపులోనే..
మునగ ఆకుల్లోని పొటాషియం అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది.