కొందరు జ్వరం అసలే రాదు. మరికొందరికి జ్వరం తరచుగా వస్తుంటుంది. ఇలా మళ్లీ మళ్లీ జ్వరం వస్తే మాత్రం వెంటనే అప్రమత్తం అవ్వాలి. వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. ఈ విషయాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా తరచుగా జ్వరం రావడం అనేది ఏదైనా వ్యాధి ప్రారంభ లక్షణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఓ పరిశోధన ప్రకారం.. ఒక వ్యక్తి సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.6 డిగ్రీల ఫారెన్‌హీట్. 100.4 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే దానిని జ్వరం అంటారు. మళ్లీ మళ్లీ తరచుగా జ్వరం రావడాన్ని ఎపిసోడిక్ జ్వరం అంటారు. 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో తరచుగా జ్వరం సమస్య కనిపిస్తుంది. తరచుగా జ్వరం రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు.
పగటిపూట లేదా వ్యాయామం తర్వాత కొంతసేపు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కానీ పదేపదే జ్వరం రావడం అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌ని సూచిస్తుంది. పీరియాడిక్ ఫీవర్ సిండ్రోవ్ వల్ల ఇది వస్తుంది. అంతేకాదు.. జన్యుపరమైన లోపాల వల్ల కూడా ఈ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాల వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి జ్వరం వస్తుంది.
1. వైరస్
2. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్
3. టీకా
1. నీరు ఎక్కువగా తాగాలి.
2. పదే పదే జ్వరం వస్తే.. వారి శ్వాస తీసుకునే విధానాన్ని గమనించాలి.
3. పిల్లలకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండి.. జ్వరం 5 రోజుల కంటే ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
4. జ్వరం ఉన్నంత కాలం జాగ్రత్తగా చూసుకోవాలి.
5. మళ్లీ మళ్లీ జ్వరం వస్తుంటే వైద్యులను సంప్రదించి సలహాలు తీసుకోవాలి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..