Health Tips: ఆహారం తిన్న తరువాత కడుపులో నొప్పిగా ఉందా? ఇలా రిలీఫ్ పొందండి..

|

Jun 15, 2023 | 7:13 PM

ఆహారం తిన్న తరువాత కడుపులో తిమ్మిరి, వికారం, వాంతులు వచ్చినట్లు అవుతుందా? చాలా వరకు బయట ఆహారం తిన్న తరువాత ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ పాయిజన్ కారణంగానే...

Health Tips: ఆహారం తిన్న తరువాత కడుపులో నొప్పిగా ఉందా? ఇలా రిలీఫ్ పొందండి..
Healthy Food
Follow us on

ఆహారం తిన్న తరువాత కడుపులో తిమ్మిరి, వికారం, వాంతులు వచ్చినట్లు అవుతుందా? చాలా వరకు బయట ఆహారం తిన్న తరువాత ఇలాంటి పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. ఫుడ్ పాయిజన్ కారణంగానే ఈ పరిస్థితి ఎదురయ్యే ఛాన్స్ ఉంది. మసాలా అధికంగా ఉన్న ఆహారం తిన్నా.. నిల్వ ఉంచిన ఆహారం తిన్నా ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఎసిడిటీ సమస్య కూడా పెరగుతుుంది. ఎసిడిటీ సమస్య ఉంటే కూడా ఇలాగే తిమ్మిర్లు, వాంతి, కడుపులో నొప్పి వస్తుంది. ఎంఏఎంసీ ‘జర్నల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ ప్రకారం.. భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు రెండు మిలియన్ల మరణాలకు పాడైపోయిన ఆహారం, కలుషిత నీరు తాగడమే కారణం అని నిర్ధారించారుర.

ఫుడ్ పాయిజన్, వాంతులు..

ఫుడ్ పాయిజనింగ్.. సాధారణంగా వికారం, వాంతులు, కడుపు నొప్పి, లూజ్ మోషన్‌తో మొదలవుతుంది. నిల్వ ఉంచిన ఆహారం, పాడైపోయిన ఆహారం తిన్న కొద్ది గంటల్లోనే కడుపు నొప్పి మొదలవుతుంది. వైరస్, బాక్టీరియా ఇన్ఫెక్షన్ కారణంగా కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. ఈ సమయంలో లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. అధిక వాంతులు, కడుపు నొప్పి, డీహైడ్రేషన్ వల్ల వచ్చే అవకాశం కూడా ఉంది. డీహైడ్రేషన్ వల్ల నోరు పొడిబారడం, ఆకలి లేకపోవడం, మత్తుగా ఉండటం జరుగుతంది.

సమస్య నివారణకు ఇలా చేయాలి..

1. డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడేందుకు జ్యూస్‌లు, నీరు, ఓరల్ రీహైడ్రేషన్

ఇవి కూడా చదవండి

2. సొల్యూషన్స్(ఓఆర్ఎస్) వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

3. అవసరమైనంత విశ్రాంతి తీసుకోవాలి. అలసిపోకుండా ఉండాలి.

4. మసాలా, ఆయిల్ ఆహారాలకు దూరంగా ఉండాలి. పెరుగు, అన్నం, కిచిడీ, కూరకు బదులుగా 5. టోస్ట్, అరటిపండ్లు తినడం ఉత్తమం.

6. తీవ్రమైన కడుపునొప్పి, అతిసారం ఆగకపోతే.. వైద్యుల సలహా మేరకు మెడిసిన్స్ వాడాలి.

7. అధిక విరేచనాల నివారణకు యాంటీబయాటిక్ మెడిసిన్స్ కూడా వాడొచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..