AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Benefits: మీరు వారానికి మూడు సార్లు చేపలు తింటున్నారా..? అయితే ఆ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..!

ప్రస్తుతం తరుణంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త కొత్త వైరస్‌లు, కొత్త కొత్త వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మానవుని జీవనశైలిలో మార్పుల కారణంగా ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉద్యోగంలో ఒత్తిడి..

Fish Benefits: మీరు వారానికి మూడు సార్లు చేపలు తింటున్నారా..? అయితే ఆ సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు..!
Fish Benefits
Subhash Goud
|

Updated on: Apr 10, 2023 | 6:51 PM

Share

ప్రస్తుతం తరుణంలో ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొత్త కొత్త వైరస్‌లు, కొత్త కొత్త వ్యాధులు చుట్టుముడుతున్నాయి. మానవుని జీవనశైలిలో మార్పుల కారణంగా ఎంతో మంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఉద్యోగంలో ఒత్తిడి, ఆహార నియమాలలో మార్పులు, అధిక ఒత్తిడి కారణంగా మనిషికి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారంపై కూడా ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మాంసాహారంలో చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం అందరికి తెలిసిందే. మార్కెట్లో దొరికి వివిధ రకాల మాంసాలకన్నా చేపలు తినడం ఎంతో ప్రయోజనమంటున్నారు పరిశోధకులు. కొందరు వారంలో రెండు, మూడు సార్లు నాన్‌వేజ్‌ తింటుంటే మరి కొందరు వారానికి ఒక రోజు మాత్రమే తింటుంటారు. అలాంటి నాన్‌వెజ్‌ కేటగిరిలో చేపలను కూడా చేర్చడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

గుండె వ్యాధులకు చేపలతో చెక్‌..

చేపలు ఆరోగ్యానికి ఎంతో మంచివని, ముఖ్యంగా గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చని ఓ సర్వేలో తేల్చారు నిపుణులు. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వెల్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన పరిశోధనలలో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జనాభాలో చాలామంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు చేపలను వారానికి రెండు, మూడు సార్లు తిన్నట్లయితే అందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గుండెకు ఎంతో మేలు చేకూర్చుతుందని చెబుతున్నారు. న్యూసౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు జార్జ్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్ తో కలిసి పలు దేశాలకు చెందిన 25వేల మందిపై ఈ పరిశోధన నిర్వహించినట్లు వారి పరిశోధన నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిశోధనలో చేపల వల్ల గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులకు చెక్ పెట్టవచ్చని తేల్చేశారు.

ప్రపంచంలోని 12 దేశాలకు చెందిన ఒకరిద్దరు కాదు.. దాదాపు 25వేల మందిపై సుమారు 19 సార్లు ట్రయల్స్ చేసి మరీ చేపల వల్ల గుండె, కిడ్నీలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాలన్నీ కనుగొన్నారు పరిశోధకులు. వారంలో కనీసం మూడు సార్లు చేపలు తినడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు. ఈ చేపల ద్వారా మనిషి శరీరంలోకి కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలతో పాటు విటమిన్-D మానవ శరీరంలోకి చేరుతుంది. దీని ఫలితంగా కిడ్నీ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయని చెబుతున్నారు. చేపల్లో కూడా ఆయిలీ ఫిష్ జాతికి చెందిన సాల్మన్, ట్రౌట్, టునా, స్వోర్డ్ ఫిష్, మాకరల్, సార్డెన్స్, హెర్రింగ్ వంటి చేపలు అయితే ఇంకా మరింత మంచిదంటున్నారు. చేపల్లో ఉండే ఒమేగా-3 పాలి అసంతృప్త కొవ్వు ఆమ్లాలు మన గుండెతో పాటు కిడ్నీలకు ఎంతో మేలు చేస్తాయని తాజాగా జరిపిన పరిశోధనల ద్వారా వెల్లడి అయిందని న్యూసౌత్ వేల్స్ యూనివర్సిటీ పరిశోధకులు తేల్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి