Urination Problem: మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా ఉందా?.. ఇది ఆ వ్యాధి లక్షణం కావొచ్చు..!

|

Nov 07, 2021 | 6:25 PM

Urination Problem: మూత్ర విసర్జన చేసే సమయంలో మంటగా అనిపించినా.. మూత్రం రంగులో ఏమాత్రం మార్పు కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయకండి.

Urination Problem: మూత్ర విసర్జన చేసేటప్పుడు మంటగా ఉందా?.. ఇది ఆ వ్యాధి లక్షణం కావొచ్చు..!
Urination Problems
Follow us on

Urination Problem: మూత్ర విసర్జన చేసే సమయంలో మంటగా అనిపించినా.. మూత్రం రంగులో ఏమాత్రం మార్పు కనిపించినా అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఇది డైసూరియా లక్షణం కావొచ్చు. మూత్రంలో ఇన్ఫెక్షన్, కిడ్నీలో రాళ్లు ఏర్పడడం వల్ల ఈ రకమైన సమస్య వస్తుంది. ఇలా పరిస్థితి ఎదురైతే.. మీరు వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.

నెఫ్రాలజిస్ట్ డాక్టర్ హిమాన్షు వర్మ ప్రకారం.. అపరిశుద్ధ ఆహారం, మూత్రనాళంలో ఏదైనా బ్యాక్టీరియా కారణంగా మూత్రంలో మంట ఏర్పడటం జరుగుతుంది. ఇవి కాకుండా, మూత్ర విసర్జన సమయంలో మంటలు రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ఏదైనా ఔషధం (కీమోథెరపీ ఔషధం వంటివి), మూత్రపిండాల్లో రాళ్లు, కటి ప్రాంతంలో రేడియేషన్ థెరపీ తీసుకోవడం వంటివి కూడా ఈ సమస్యను కలిగిస్తాయి. అలాంటి సందర్భాలలో చెడు బ్యాక్టీరియా మూత్రాశయం, మూత్రనాళంలో పెరుగుతూనే ఉంటుంది. అలా ఆ బ్యాక్టీరియా కిడ్నీకి చేరుకుంటుంది. ఫలితంగా మూత్రంలో వాసన, దాని రంగు కూడా మారుతుంది. మూత్రం పింక్, ఎరుపు రంగులో ఉంటే మూత్ర నాళంలో రక్తస్రావం ఉందని అర్థం. ఇది చాలా ప్రమాదకరమైనది.

మూత్రపిండాల ఇన్‌ఫెక్షన్..
మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించడం కిడ్నీ ఇన్ఫెక్షన్ ప్రారంభ లక్షణమని డాక్టర్ వివరిస్తున్నారు. అయితే కిడ్నీ ఇన్ఫెక్షన్ లక్షణాలు కేవలం మూత్రం ద్వారా మాత్రమే తెలియవు. కొన్నిసార్లు నడుము దిగువ భాగంలో నిరంతరంగా నొప్పి రావడం జరుగుతుంది. రాను రాను వాంతులు కూడా అవుతాయి. ఇవన్నీ కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో సంబంధం కలిగి ఉంటాయి. కావున.. మీకు కూడా ఇలాంటి లక్షణాలు అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ సమస్యకు త్వరగా చికిత్స చేయకపోతే మూత్రపిండాల వైఫల్యానికి దారి తీస్తుంది. ఫలితంగా కిడ్నీ మారిస్తే గానీ రోగి ప్రాణాలను కాపాడే పరిస్థితి ఎదురవుతుంది.

నీరు ఎక్కువగా తాగాలి..
నీరు తక్కువగా తాగడం వల్ల కూడా డైసూరియా సమస్య వస్తుందని డాక్టర్ హిమాన్షు తెలిపారు. రోజంతా నీళ్లు ఎక్కువగా తాగాలి. ఇది మీ శరీరం నుండి మలినాలను, చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. మూత్రనాళాన్ని పూర్తిగా శుభ్రంగా ఉండేలా చేస్తుంది. అలాగే.. మీరే తినే ఆహారం, జీవన శైలి సక్రమంగా ఉండేలా చూసుకోండి. ఇంకా మద్యానికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.

Also read:

SBI PET Admit Card 2021: SBI ప్రొబేషనరీ ఆఫీసర్ పరీక్ష అడ్మిట్ కార్డ్ విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

Wife and Husband: మీ భర్త మిమ్మల్ని పట్టించుకోవట్లేదనే అనుమానం కలుగుతుందా? అయితే ఇవి తెలుసుకోండి..!

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాలో బ్యాంకు వివరాలు అప్‌డేట్ చేసుకోండిలా..