ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం (Exercise) చేయాలనే విషయం తెలిసిందే. వ్యాయామం అంటే జిమ్ లో చేసేది మాత్రమే కాదు. మనం చేసే చిన్న చిన్న పనులు అన్నీ ఎక్సర్సైజ్ కిందికే వస్తాయి. సాధారణంగా చాలా మంది వ్యాయామం అంటే కఠినమైన వర్కౌట్లు చేయడం, చెమలు కక్కేలా కష్టపడటం అని అనుకుంటారు. కానీ అది ఏమాత్రం కాదు. వాకింగ్ చేసినా అది వ్యాయామం చేసినట్లే. ఇంకా చెప్పాలంటే వ్యాయామం వల్ల శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపడుతుంది. అయితే వాకింగ్ (Walking) విషయంలో చాలా మందికి ఎన్నో రకాల సందేహాలు ఉంటాయి. కామన్ గా అయితే మార్నింగ్ వాక్, ఈవ్ నింగ్ వాక్ చేస్తారు. అయితే ఏదైనా తిన్నాక చేయాలా.. లేదా పరగడుపున నడవాలా? రోజులో ఏ సమయంలోనైనా నడవొచ్చా? ఇంట్లో కూడా వాకింగ్ చేయొచ్చా? అనే విషయాలపై మనకు ఎన్నో డౌట్స్ ఉన్నాయి. సాధారణంగా ఉదయం పూట నడవటం మంచిది. కాలుష్యం తక్కువగా ఉండటమే కాకుండా రాత్రంతా విశ్రాంతి తీసుకోవడం ద్వారా మెదడు చురుగ్గా పని చేస్తుంది. చల్లటి, తాజా గాలి మనసుకు హాయి కలిగించి కొన్ని రకాల హోర్మోన్లు రిలీజ్ అవుతాయని, ఫలితంగా రోజంతా ఉత్సాహంగా గడిపేందుకు సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే షుగర్ వ్యాధితో బాధపడేవారు వాకింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వారు పరగడుపున నడవడం ఏ మాత్రం మంచిది కాదు. కనీసం చిన్న బ్రెడ్డు ముక్కలాంటిదైనా తిని నడవాలి. అంతే కాకుండా కడుపు నిండా తిని నడవటం మంచి పద్ధతి కాదు. భోజనం చేసినప్పుడు జీర్ణవ్యవస్థకు రక్త ప్రసరణ బాగా జరగాలి. కడుపు నిండా తిని వేగంగా నడిస్తే గుండెపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. సాయంత్రం పూట నడవకూడదనేమీ లేదు. ఉదయం నుంచి వివిధ రకాల పనులు చేసి, చేసి శరీరం అలసిపోతుంది కాబట్టి మార్నింగ్ వాక్ చేయడమే ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..