Health care tips: ఆహారం తినకుండా కొన్ని రోజులు ఉండగలరు కానీ, మంచి నీరు తాగకుండా ఒక్క రోజు కూడా ఉండలేని పరిస్థితి ఉంటుంది. శరీరానికి మంచినీరు అంత అవసరం. అయితే, మంచినీరు తక్కువ తాగే అలవాటు ఉన్నా, నీరు తాగకపోయిన.. ప్రమాదాన్ని ఏరికోరి తెచ్చుకుంటున్నట్లేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరు తక్కువగా తాగడం వలన వచ్చే సమస్యలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మలబద్ధకం..
శరీరంలో నీటి కొరత కారణంగా మలబద్ధకం వంటి తీవ్రమైన సమస్యలు ఉత్పన్నమవుతాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే పైల్స్ వంటి వ్యాధికి దారి తీస్తుంది.
మూత్రంలో మంట..
నీరు తక్కువగా తాగడం వల్ల మూత్రంలో ఇన్‌ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. మూత్ర విసర్జన సమయంలో మంట వస్తుంది. అత్యంత దారుణ పరిస్థితి ఉండే అవకాశం ఉంది. అందుకే.. రోజుకు కనీసం 3 లీటర్ల నీళ్లు అయినా తాగాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
చర్మ సమస్యలు..
నీరు తాగకపోవడం వల్ల చర్మం పొడిబారిపోతుంది. డీహైడ్రేషన్ సమస్యలు ఉత్పన్నమవుతాయి. చర్మం నిస్తేజంగా కనిపిస్తుంటుంది. దీంతోపాటు.. మొటిమలు, ఇతర సమస్యలు కూడా మొదలవుతాయి. శరీరానికి సరిపడా నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అప్పుడు చర్మ సమస్యలు ఏమీ ఉండవు.
కిడ్నీ సమస్యలు..
నీరు తక్కువగా తాగడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. కిడ్నీలో ఇన్‌ఫెక్షన్స్ ఏర్పడుతాయి. మూత్రపిండాలు మన శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తాయి. అయితే నీటి కొరత కారణంగా కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ఎనర్జీ లెవెల్..
శరీరానికి సరిపడా నీరు క్రమం తప్పకుండా తాగితే శరీరంలో శక్తి ఉంటుంది. లేదంటే.. ఎనర్జీ లెవల్స్ దారుణంగా పడిపోతాయి. నీటి కొరత కారణంగా శరీరంలో ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. త్వరగా అలసిపోతుంటారు. అందుకే శరీరానికి సరిపడా నీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Also read:
Russia – Ukraine Crisis: పుతిన్ ప్లాన్ రివర్స్.. రష్యాకు చుక్కలు చూపిస్తున్న ఉక్రెయిన్ సైన్యం..!
Bank Holiday Alert: సమ్మె ఎఫెక్ట్.. ఆ రెండు రోజులు పలు బ్యాంకులు బంద్.. పూర్తి వివరాలు మీకోసం..!