Star Fruit: స్టార్ ఫ్రూట్‌తో ఆ సమస్యలన్నీ మటుమాయమే.. ఈ పండు లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

|

Dec 19, 2022 | 8:37 AM

స్టార్ ఫ్రూట్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. స్టార్ ఫ్రూట్ చూడటానికి మంచిగా కనిపించకపోవచ్చు.. కానీ, ఈ పండులో అనేక ప్రయోజనాలు దాగున్నాయి.

Star Fruit: స్టార్ ఫ్రూట్‌తో ఆ సమస్యలన్నీ మటుమాయమే.. ఈ పండు లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
Star Fruit
Follow us on

స్టార్ ఫ్రూట్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. స్టార్ ఫ్రూట్ చూడటానికి మంచిగా కనిపించకపోవచ్చు.. కానీ, ఈ పండులో అనేక ప్రయోజనాలు దాగున్నాయి. దక్షిణ-తూర్పు ఆసియాలోని ఉష్ణమండల దేశాలలో కనిపించే స్టార్ ఫ్రూట్ సూపర్ ఫుడ్ అని నిపుణులు పేర్కొంటున్నారు. కారాంబోలా, లేదా ఉష్ణమండల ఆగ్నేయాసియాకు చెందిన చెట్టు జాతికి చెందినది స్టార్ ఫ్రూట్.. దీనిలోని పోషకాలు, విటమిన్లు మనం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడతాయి. ఈ పండును భారతదేశం, మలేషియా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో కూడా తింటారు. ఈ స్టార్ ప్రూట్లో విటమిన్ ఎ, బి , సి పుష్కలంగా ఉన్నాయి. చర్మ, జుట్టు సమస్యలను దూరం చేయడంలో ఇది సహాయపడుతుంది. కావున ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రుచికరమైన స్టార్ ఫ్రూట్ ఆరోగ్యానికి చాలా మేలు నచేస్తుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న ఈ పండు.. ఫైబర్ కు మంచి మూలంగా పరిగణిస్తారు. ఇది రక్తస్రావ నివారిణి లక్షణాలను కలిగి ఉంది. యాంటీఆక్సిడెంట్లు, హైపోగ్లైసీమిక్ సమృద్ధిగా ఉంటుంది. అంతే కాకుండా ఇది మన చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది.

చర్మానికి ప్రయోజనకరం..

ప్రతి ఒక్కరూ తమ చర్మాన్ని అందంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. స్టార్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల చర్మం మెరిసేలా చేస్తుంది. స్టార్ ఫ్రూట్‌లోని విటమిన్ సి.. యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మం రంగు మెరిసేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మొటిమలను నయం చేస్తుంది..

చాలామంది చర్మంపై, మొహంపై మొటిమలతో బాధపడుతుంటారు. స్టార్ ఫ్రూట్ చర్మంపైనున్న మొటిమలను నయం చేయడంలో సహాయపడుతుంది. మొటిమల సమస్య వాస్తవానికి విటమిన్ సి లోపం వల్ల వస్తుంది. స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీన్ని తినడం వల్ల మొటిమల సమస్య తొలగిపోతుంది.

జుట్టు పెరుగుతుంది..

అనేక పోషకాలు దాగున్న స్టార్ ఫ్రూట్ జుట్టు పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ బి లభిస్తుంది. ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల జుట్టు మూలాల నుంచి బలపడుతుంది. ఇంకా చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారికి స్టార్ ఫ్రూట్‌తో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..