ఉసిరికాయతో ఇన్ని అద్భుతాలా.. వింటే షాక్ అవుతారు!!

ఉసిరికాయలో ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి. ఉసిరికాయను చాలా పేర్లతో పిలుస్తూంటారు. వీటిని వివిధ మెడిసిన్స్ లో కూడా వాడుతూంటారు. ఆయుర్వేద వైద్యంలో ఉసిరి ప్రముఖ పాత్ర వహిస్తుంది. తల వెంట్రుకలు మొదలు కాలిగోర్ల..

ఉసిరికాయతో ఇన్ని అద్భుతాలా.. వింటే షాక్ అవుతారు!!
Amla

Updated on: Jul 22, 2023 | 8:42 PM

ఉసిరికాయలో ఎన్నో ఔషధ విలువలు ఉన్నాయి. ఉసిరికాయను చాలా పేర్లతో పిలుస్తూంటారు. వీటిని వివిధ మెడిసిన్స్ లో కూడా వాడుతూంటారు. ఆయుర్వేద వైద్యంలో ఉసిరి ప్రముఖ పాత్ర వహిస్తుంది. తల వెంట్రుకలు మొదలు కాలిగోర్ల వరకు మానవ శరీరానికి ఉపయోగపడే సర్వరోగ నివారిణి ఉసిరి.

ఉసిరికాయలోని విటమిన్ సి మనకు చాలా మేలు చేస్తోంది. జలుబు, దగ్గును నివారించడానికి ఉసిరి అత్యుత్తమమైనదని వైద్యులు చెబుతారు. ఉసిరి తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రించబడతాయి. ఉసిరి చర్మవ్యాధులకు అద్భుతంగా పని చేస్తోంది.

ఉసిరి చర్మపు ముడతలను సైతం నివారిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉసిరి ముఖ్యంగా రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఉసిరిని నేరుగా ఎక్కువగా తినలేం కాబట్టి.. ఆహారంతో ఉడకబెట్టడం లేదా పచ్చడి చేయడం ద్వారా తినవచ్చు. ఖాళీ కడుపుతో ఉసిరి తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు కూడా చెబుతూంటారు.

ఇవి కూడా చదవండి

ఉసిరితో అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను సైతం నియంత్రించవచ్చు. ఉసిరి జ్యూస్ రోజూ తాగడం వల్ల డయాబెటిస్ సమస్యను తగ్గించుకోవచ్చు. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఉసిరిని ఉపయోగించుకోవచ్చు. ఉసిరి రసం కేవలం దాహాన్ని తీర్చడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తోంది.

రోజుకు ఒక ఉసిరికాయ తిన్నట్లయితే అన్ని రకాల పైత్యాలు తగ్గుతాయి. ఉసిరికాయ వల్ల కఫము ఉంటే తగ్గుతుంది. ఈ కాయను తినడం వల్ల మేధస్సు కూడా పెరుగుతంది. ఇది తింటే శారీరక బలమే కాకుండా వీర్యపుష్టి కూడా కలుగుతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్ చేయండి