AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కీరదోసలో అద్భుత పోషకాలు.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!

Health Tips: కీరదోసలో(Cucumber) ఎన్నో పోషకాలు ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే. నీటి శాతం అధికంగా ఉండే ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని

Health Tips: కీరదోసలో అద్భుత పోషకాలు.. ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం..!
Cucumber
uppula Raju
|

Updated on: Apr 09, 2022 | 9:45 PM

Share

Health Tips: కీరదోసలో(Cucumber) ఎన్నో పోషకాలు ఉంటాయన్న విషయం మనకు తెలిసిందే. నీటి శాతం అధికంగా ఉండే ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి, ఊబకాయం, మలబద్ధకం వంటి సమస్యలు రావని చెబుతున్నారు. కీరదోసను తినడం వల్ల అనేక వ్యాధుల బారి నుంచి బయటపడవచ్చు. కీరదోసని ఎక్కువగా సలాడ్స్‌లో ఉపయోగిస్తారు. అధికంగా తిన్నా సులభంగా జీర్ణమయ్యే లక్షణాన్ని కలిగి ఉంటుంది. కీరదోసను గుండ్రంటి ముక్కులుగా కోసుకుని, చాట్ చల్లుకుని తింటే ఆ హాయే వేరు. కీరదోస శరీరంలో వేడిని తగ్గిస్తుంది. డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఊబకాయంతో బాధపడేవారికి కీరదోస మంచి ఔషధంగా పనిచేస్తుంది. శరీరంలో చక్కెర నిల్వలను తగ్గించి షుగర్‌ను అదుపులో ఉంచుతుంది. అందువల్ల డయాబెటీస్‌ పేషెంట్లు కీరా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

కీరదోసలో క్యాన్సర్‌ని నిరోధించే గుణాలు అధికంగా ఉంటాయి. మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్‌ వంటి విటమిన్లు ఉంటాయి. దీనిని తినడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. దీనిలో ఉండే విటమిన్లు బ్లడ్‌ ప్రెజర్‌ను తగ్గించి రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా సహకరిస్తాయి. కీర దోసలో 95 శాతం నీరు ఉండడం వల్ల వేసవిలో శరీరం డీహైడ్రేషన్‌ అవకుండా కాపాడుతుంది. వేసవిలో కీరదోసను తీసుకోవడం వల్ల దాహం సమస్య దూరంగా ఉంటుంది. విటమిన్‌ ‘బి’తలనొప్పిని తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. కీర దోసను జ్యూస్‌గా చేసుకుని తాగడం వల్ల కడుపులో పుండ్లు రాకుండా ఉంటాయి. కీరదోసను గుండ్రంగా కోసి కళ్లపై ఉంచుకోవడం వల్ల కళ్ల మంటలు, ఎరుపులు తగ్గి, కళ్లు కాంతివంతంగా మారుతాయి.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

Indian Currency: భారతీయ కరెన్సీ నోట్లపై ఎన్ని భాషల్లో సమాచారం ఉంటుందో తెలుసా..!

Meat: మాంసం అతిగా తింటే ఇబ్బందే.. ఈ విషయాలు తెలుసుకుంటే మంచిది..!

Sri Ram Navami 2022: శ్రీరామనవమి సందర్భంగా ఏ పనులు చేయాలి.. ఏవి చేయకూడదు..!