Hing Health Benefits: ఇంగువతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. బరువు తగ్గేందుకు ఎలా తీసుకోవాలంటే
Health Care Tips: ఇంగువ (Asafoetida) అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. స్వచ్ఛమైన ఇంగువను ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్,
Health Care Tips: ఇంగువ (Asafoetida) అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. స్వచ్ఛమైన ఇంగువను ఆయుర్వేద ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు జీర్ణ సమస్యలను మరియు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈక్రమంలో ఇంగువ నీటిని తాగితే అనేక సమస్యలు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియకు మంచిది జీర్ణ సమస్యలను నయం చేయడంలో ఇంగువ బాగా సహాయపడుతుంది. పరిశోధనల ప్రకారం.. జీర్ణక్రియను ప్రేరేపించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. లాలాజల స్రావం లాలాజల అమైలేస్ ఎంజైమ్ చర్యను పెంచుతుంది. ఇది శరీరంలో పిత్త ప్రవాహాన్ని ప్రేరేపించడం ద్వారా డైటరీ లిపిడ్ల జీర్ణక్రియలో సహాయపడుతుంది. ఇక ఇంగువ నీరు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. జీవక్రియను పెంచడానికి, గోరువెచ్చని నీటిలో ఇంగువ తీసుకోండి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బరువు తగ్గడంలో ఎఫెక్టివ్ ఇంగువ నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల క్రమంగా బరువు తగ్గవచ్చు. ఇందులో స్థూలకాయాన్ని నిరోధించే గుణాలు అధికంగా ఉన్నాయి. శరీరంలో కొవ్వును కూడా కరిగిస్తుంది.
రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది ఇంగువ రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది హైపోగ్లైసీమిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుంది.
మరిన్ని హెల్త్ టిప్స్ కోసం క్లిక్ చేయండి..