Health News: ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. రోజుకు ఎన్ని తింటే మంచిది?

ఖర్జూరంలో శరీరానికి మేలు చేసే వివిధ ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఖర్జూరంలో ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్..

Health News: ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. రోజుకు ఎన్ని తింటే మంచిది?
డెజర్ట్‌లలో పంచదార కలపడం కంటే, చాలా మంది ఖర్జూరాలను కలిపి తీసుకుంటూ ఉంటారు. దీనిలోని తీపి రుచి కారణంగా చక్కెరకు ప్రత్నామ్నాయంగా వినియోగించుకోవచ్చు. ఖర్జూరాన్ని క్రమం తప్పకుండా తినడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Follow us

|

Updated on: Jul 07, 2024 | 6:34 AM

ఖర్జూరంలో శరీరానికి మేలు చేసే వివిధ ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. ఖర్జూరాన్ని రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. ఖర్జూరంలో ఐరన్, కాల్షియం, ఫైబర్, ప్రొటీన్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి-6 పుష్కలంగా ఉన్నాయి.

శరీరంలో ఐరన్ కంటెంట్ పెరగడం నుండి రక్త ఉత్పత్తిని ఉత్తేజపరిచే వరకు, ఖర్జూరాలు అనేక ముఖ్యమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఖర్జూరంలో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఖర్జూరం తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి.

ఖర్జూరాలు గుండె ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. మెరుగైన జీర్ణక్రియలో సహాయపడతాయి. శరీరం మొత్తం పనితీరుకు అవసరమైన శక్తిని అందిస్తాయి. అంతే కాకుండా ఖర్జూరంలో విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ఖర్జూరంలో పొటాషియం, ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముక సంబంధిత సమస్యల నుండి కాపాడతాయి. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

గమనిక: ఖర్జూరాల్లో సహజసిద్ధమైన చక్కెర, క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రోజుకు ఐదు కంటే ఎక్కువ ఖర్జూరాలను తీసుకోవడం శరీరానికి హానికరమని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి