ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే నిద్ర ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజూ రాత్రి పడుకుంటేనే.. ఉదయానికి ఎనర్జిటిక్ గా ఉండగలరు. ఏ పని చేయాలన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ రాత్రి పూట సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మొత్తం దిన చర్యకే బ్రేక్ పడుతుంది. ఏ పనీ చేయలేము. దేని మీద కూడా ఇంట్రెస్ట్ చూపించలేదరు. తరచుగా మీరు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటే మాత్రం వైద్యుల్ని సంప్రదించడం మేలు. అలాగే మీ ఆహారంలో కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలి. అలాగే ఈ చిట్కాలు కూడా మీకు బాగా హెల్ప్ అవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
రాత్రి పడుకునే ముందు చెర్రీస్ తింటే మీకు హాయిగా నిద్ర పడుతుంది. చెర్రీస్ లో మెలటోనిన్ అనేది పుష్కలంగా ఉంటుంది. ఇది నిద్ర పట్టేందుకు హెల్ప్ చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కావాలంటే చెర్రీ జ్యూస్ కూడా తాగొచ్చు.
రాత్రి పడుకునే ముందు నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఇది మెదడుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బాదాంలో ఉండే మెగ్నీషియం.. ఒత్తిడిని తగ్గించి.. బాగా నిద్ర పట్టేందుకు సహాయ పడుతుంది. ప్రతి రోజూ నానబెట్టిన బాదం ఉదయమే కాకుండా.. రాత్రి తిన్నా మంచి బెనిఫిట్స్ ఉంటాయి.
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని పాలు తాగడం వల్ల సెరోటోనిన్, ట్రిప్టోఫోన్ అనే హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి నిద్ర పోవడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే పాలు తాగడం ఇష్టం లేని వారు గోరు వెచ్చటి నీళ్లు తాగినా పర్వాలేదు. ఇలా తాగడం వలన మీ మైడ్ అండ్ బాడీ రిలాక్స్ అవుతుంది. దీంతో ఆటోమెటిక్ గా నిద్ర పడుతుంది.
నిద్ర పట్టని వారు వీలైనంత వరకు రాత్రి పడుకునే ముందు స్క్రీనింగ్ కి దూరంగా ఉండాలి. ఫోన్, టీవీ, ల్యాప్ టాప్స్ వంటివి చూస్తే.. నిద్ర ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి వీటిని వీలైనంత వరకూ దూరంగా ఉంచండి.
నిద్ర అనేది చాలా అవసరం. అలాగే అతి నిద్ర వల్ల కూడా అనర్థాలు వస్తాయి. మనిషి తన వయసుకు తగ్గట్టుగా నిద్ర పోవాలి. లేదంటే ఇది పెద్ద సమస్యగా మారుతుంది. సరిగ్గా నిద్ర లేకపోతే మానసిక సమస్యలు, షుగర్, బీపీ, కాలేయ, మూత్ర పిండాల సమస్యలు వస్తాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.