Dry Skin Tips: మీ స్కిన్ పొడిగా, డల్‌గా మారిందా? ఈ కారణాల వల్లే..

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. అవసరం అయినన్ని పోషకాలు ఖచ్చితంగా కావాలి. ఏది ఎక్కువై.. ఏది తక్కువైనా.. అనేక సమస్యలు వస్తాయి. చాలా నేటి కాలంలో వివిధ రకాల విటమిన్స్ లోపాలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. మారిన లైఫ్ స్టైల్, ఆహార మార్పుల కారణంగా అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. పోషకాల్లో విటమిన్స్ కూడా చాలా ముఖ్యంగా. ఈ విటమిన్స్ లోపించడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఈ క్రమంలో విటమిన్స్ లోపం వల్ల చర్మ సమస్యల్ని..

Dry Skin Tips: మీ స్కిన్ పొడిగా, డల్‌గా మారిందా? ఈ కారణాల వల్లే..
Skin Care Tips

Edited By: Ravi Kiran

Updated on: Jan 15, 2024 | 3:40 PM

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే.. అవసరం అయినన్ని పోషకాలు ఖచ్చితంగా కావాలి. ఏది ఎక్కువై.. ఏది తక్కువైనా.. అనేక సమస్యలు వస్తాయి. చాలా నేటి కాలంలో వివిధ రకాల విటమిన్స్ లోపాలతో ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. మారిన లైఫ్ స్టైల్, ఆహార మార్పుల కారణంగా అనేక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. పోషకాల్లో విటమిన్స్ కూడా చాలా ముఖ్యంగా. ఈ విటమిన్స్ లోపించడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. ఈ క్రమంలో విటమిన్స్ లోపం వల్ల చర్మ సమస్యల్ని కూడా ఎదుర్కొంటున్నారు. విటమిన్స్ లోపించడం వల్ల చర్మం కళ తప్పి.. పొడిగా, నిర్జీవంగా మారుతుంది. మరి చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల విటమిన్లు చాలా అవసరం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ ఇ:

విటమిన్ ఇ లోపం కారణంగా చర్మం పొడి బారిపోతుంది. స్కిన్ డల్‌గా నిర్జీవంగా ఉంటుంది. చర్మంపై తగినత తేమ ఉండదు. విటమిన్ ఇ అందించడం వల్ల చర్మం కాంతి వంతంగా మారుతుంది. అంతే కాకుండా చర్మ ఛాయ కూడా పెరుగుతుంది. వాతావరణ కాలుష్యం కారణంగా చర్మం దెబ్బ తినకుండా ఉంటుంది. ఫ్రీరాడికల్స్ కారణంగా చర్మానికి నష్టం కలుగకుండా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా విటమిన్ ఇ ఉండే ఆహారాలు మీ డైట్ లో ఉండేలా చూసుకోండి.

విటమిన్ డి:

శరీరంలో తగింన విటమిన్ డి లేనందు వల్ల కూడా చర్మ సమస్యలు తలెత్తుతాయి. విటమిన్ డి లోపిస్తే.. చర్మం ఇన్ ఫెక్షన్‌ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చర్మం కూడా పొడి బారి పోతుంది. విటమిన్ డి తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, వ్యాధి కారక క్రిముల నుండి హాని కలగకుండా ఉంటుంది. విటమిన్ డి అనేది యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేసి.. ఫ్రీ రాడికల్స్ నుండి చర్మానికి హాని కలగకుండా కాపాడుతుంది. అంతే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా అందుతుంది.

ఇవి కూడా చదవండి

విటమిన్ సి:

విటమిన్ సి ఉండే ఆహారాలు, పానీయాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చు. విటమిన్ సి తీసుకుంటే చర్మం యంగ్‌గా తయారవుతుంది. అదే విధంగా ముడతలు పడకుండా ఉంటుంది. చర్మం క్లియర్‌గా ఉంటుంది.

విటమిన్ బి:

విటమిన్ బి వల్ల కూడా చర్మం ఆరోగ్యంగా తయారవుతుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు, దద్దుర్లు వంటివి రాకుండా చేస్తుంది. విటమిన్ బి లోపిస్తే.. పెదాలు కూడా పగులుతాయి. విటమిన్ బి తీసుకుంటే పెదాలు ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇందులో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు అనేవి పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ ప్లామేషన్‌ను తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.