Dengue Fever: డెంగ్యూ జ్వరంలో మేక పాలు ప్లేట్‌లెట్లను పెంచుతాయా!.. AIIMS డాక్టర్ ఏమి చెప్పారంటే..

|

Oct 03, 2024 | 5:39 PM

ప్లేట్‌లెట్స్ అనేవి మన రక్తంలో ఉండే అతి చిన్న కణాలు. వీటిని మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే చూడగరు. అవి తెలుపు రంగులో ఉండే రంగులేని కణాలు. ఇవి శరీరంలో రక్తస్రావాన్ని ఆపడంలో సహాయపడతాయి. వైద్య పరిభాషలో వీటిని థ్రోంబోసైట్లు అంటారు. రక్తస్రావం జరగకుండా ప్లేట్‌లెట్స్ సహాయపడతాయి. కనుక వీటిని సాధారణ స్థాయిలో ఉంచడం చాలా ముఖ్యం.

Dengue Fever: డెంగ్యూ జ్వరంలో మేక పాలు ప్లేట్‌లెట్లను పెంచుతాయా!.. AIIMS డాక్టర్ ఏమి చెప్పారంటే..
Dengue Fever
Follow us on

ఈ ఏడాది కురిసిన వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, పూణే, మహారాష్ట్ర, సహా అనేక రాష్ట్రాల్లో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. డెంగ్యూ కారణంగా ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో మరణాలు కూడా నమోదయ్యాయి. డెంగ్యూ జ్వరం సోకిన బాధితుల ప్లేట్‌లెట్స్ కౌంట్ వేగంగా పడిపోవడం ప్రారంభించినప్పుడు ప్రాణాంతకం అవుతుంది. సాధారణ శరీరంలో ఒక మైక్రోలీటర్ రక్తంలో 1,50,000 నుంచి 4,50,000 ప్లేట్‌లెట్స్ ఉంటాయి. అయితే ఈ జ్వరం బారిన పడితే ఈ ప్లేట్‌లెట్లు మైక్రోలీటర్‌కు 5,000 వరకు చేరుకుంటాయి. ఒకొక్కసారి రోగి మరణానికి కూడా దారి తీస్తుంది. అందువల్ల డెంగ్యూ జ్వరం సోకినప్పుడు ప్లేట్‌లెట్స్ సంఖ్య పెంచడానికి రోగికి ప్లేట్‌లెట్లను ఎక్కిస్తున్న సందర్భాలు ఎక్కువగానే ఉంటున్నాయి.

ప్లేట్‌లెట్స్ అనేవి మన రక్తంలో ఉండే అతి చిన్న కణాలు. వీటిని మైక్రోస్కోప్ సహాయంతో మాత్రమే చూడగరు. అవి తెలుపు రంగులో ఉండే రంగులేని కణాలు. ఇవి శరీరంలో రక్తస్రావాన్ని ఆపడంలో సహాయపడతాయి. వైద్య పరిభాషలో వీటిని థ్రోంబోసైట్లు అంటారు. రక్తస్రావం జరగకుండా ప్లేట్‌లెట్స్ సహాయపడతాయి. కనుక వీటిని సాధారణ స్థాయిలో ఉంచడం చాలా ముఖ్యం. లేకపోతే జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. డెంగ్యూ రోగి కి ప్లేట్‌లెట్‌లను పర్యవేక్షించడానికి పదేపదే రక్త పరీక్షలు చేయడానికి ఇది కారణం.

ప్లేట్‌లెట్లను పెంచే మేక పాలు

పేషెంట్ల ప్లేట్‌లెట్స్ పెరగాలంటే విటమిన్ బి12, విటమిన్ సి, ఫోలేట్, ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు తినాలని నిపుణులు చెబుతున్నారు. అయితే మేక పాలతో ప్లేట్‌లెట్ కౌంట్ కూడా పెరుగుతుందని చాలామంది నమ్ముతున్నారు. అయితే ఎయిమ్స్‌లోని మెడిసిన్ విభాగం డాక్టర్ నీరజ్ నిశ్చల్, అదనపు ప్రొఫెసర్ ఈ విషయంపై స్పందిస్తూ మేక పాలు ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి ప్రత్యక్ష సంబంధం లేదని చెప్పారు. ఎందుకంటే మేక పాలు ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచుతుందని వైద్య శాస్త్రంలో ఎక్కడా రుజువు లేదని అన్నారు. ప్రజలు తాము విన్నది నమ్మి ఇలాంటి పనులు చేస్తుంటారు. అయితే ఈ సమయంలో వైద్యుని సంప్రదించకుండా తీసుకునే సొంత వైద్యం హానికరంగా మారవచ్చు అని చెప్పారు.

ఇవి కూడా చదవండి

ప్లేట్‌లెట్లను పెంచే మార్గాలు

డెంగ్యూ రోగి ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడానికి, బొప్పాయి, దానిమ్మ, కివీ, బీట్‌రూట్, అరటిపండుతో సహా పండ్లను తినేలా చూసుకోవాలి.

డెంగ్యూ రోగికి విటమిన్ బి 12, విటమిన్ సి, ఫోలేట్ , ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని ఇవ్వాలి.

ఈ సమయంలో రోగికి ఎక్కువగా ద్రవ ఆహారం ఇవ్వండి. ఇందులో నిమ్మరసం, కొబ్బరి నీరు, మజ్జిగ మొదలైనవి ఉండేలా చూసుకోవాలి.

 

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..