Fruits for Arthritis Patients: ఇటీవల కాలంలో చాలా మందికి కీళ్ల నొప్పులు సాధారణ సమస్యగా మారాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా చాలామంది అర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నారని వైద్యులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన వారు చాలామంది ఇటీవల కాలంలో కీళ్ల నొప్పుల లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అటువంటి పరిస్థితిలో.. దానిని ఎదుర్కోవటానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న వ్యక్తులు.. వారి ఆహారంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే ఈ సమస్య మరింత పెరుగుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి చాలా మంది వ్యక్తులు అన్ని రకాల చిట్కాలను అవలంబిస్తుంటారు. అయినా.. నొప్పి తగ్గకపోతే మీరు మీ ఆహారంలో మూడు ప్రధానమైన పండ్లను చేర్చుకోవాలి. ఇవి క్రమంగా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కావున అలాంటివారు నొప్పి నుంచి బయటపడాలంటే.. ఎలాంటి మూడు పండ్లను తినాలో ఇప్పుడు తెలుసుకోండి..
కీళ్ల నొప్పుల సమస్యకు చెక్ పెట్టేందుకు తినాల్సిన పండ్లు..
నారింజ: మీ ఆహారంలో నారింజను తప్పకుండా చేర్చుకోండి. దీనిని తినడం వల్ల శరీరంలో నీటి కొరత తీరుతుందన్న విషయం అందరికీ తెలుసు. ఇందులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కీళ్ల నొప్పులను దూరం చేయడంలో ఉపయోగకరంగా ఉంటుంది.
ద్రాక్ష: ద్రాక్ష పండ్లను తీసుకోవడం ద్వారా అనేక రకాల వ్యాధుల నుంచి బయటపడవచ్చు. దీంతోపాటు ద్రాక్ష ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. ఇప్పటికైనా ద్రాక్షను తినని వారుంటే.. ఈ పండును తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి.
పుచ్చకాయ: వేసవి కాలం, ఎండ వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది పుచ్చకాయలను తింటారు. దీని వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. అంతేకాకుండా తక్షణ శక్తి లభిస్తుంది. దీంతో నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అందుకే ఈ పండును తమ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: