పిల్లలకు డబ్బా పాలు తాగిస్తున్నారా..? ఎంత డేంజరో తెలుసా..
గత కొన్ని సంవత్సరాలుగా, పిల్లలకు పుట్టిన తర్వాత ఫార్ములా పాలు లేదా పొడి పాలు తాపించే ధోరణి గణనీయంగా పెరిగింది.. అయితే ఫార్ములా పాలు పిల్లల ఆరోగ్యానికి ప్రమాదకరమని మీకు తెలుసా...? తెలియకపోతే ఈ వివరాలను తెలుసుకోండి.. ఫార్ములా మిల్క్ నమూనాలపై ఇటీవల జరిపిన పరిశోధనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి..

గత కొన్ని సంవత్సరాలుగా, పిల్లలకు పుట్టిన తర్వాత ఫార్ములా పాలు లేదా పొడి పాలు తాపించే ధోరణి గణనీయంగా పెరిగింది.. అయితే ఫార్ములా పాలు పిల్లల ఆరోగ్యానికి ప్రమాదకరమని మీకు తెలుసా…? తెలియకపోతే ఈ వివరాలను తెలుసుకోండి.. ఫార్ములా మిల్క్ నమూనాలపై ఇటీవల జరిపిన పరిశోధనలో, వాటిలో కొన్నింటిలో సీసం – ఆర్సెనిక్ ఉన్నాయని, ఇవి చిన్న పిల్లలకు ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయని కన్స్యూమర్ రిపోర్ట్స్ పేర్కొంది. కన్స్యూమర్ రిపోర్ట్స్ దాదాపు అన్ని ఫార్ములా మిల్క్ శాంపిల్స్‌లో పాలీఫ్లోరోఅల్కైల్ ఆమ్లాలు (PFAలు) కూడా ఉన్నాయని, ఒకదానిలో బిస్ఫెనాల్ A (BPA), అక్రిలామైడ్ కూడా ఉన్నాయని కనుగొన్నారు.
కన్స్యూమర్ రిపోర్ట్స్ దర్యాప్తు తర్వాత, అనేక ఫార్ములా పాల తయారీ కంపెనీలు వాటి పరీక్షా పద్ధతుల గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి.. సీసం, ఆర్సెనిక్ వంటివి వాతావరణంలో సహజంగానే లభిస్తాయని, వాటి ఫార్ములాలు సురక్షితమైనవని వారు అంటున్నారు. వీటిలో అలాంటిదేమీ లేదని పేర్కొన్నారు.. కానీ కన్స్యూమర్ రిపోర్ట్స్ సీసం, ఆర్సెనిక్ కనుగొనబడ్డాయని, ఇది ప్రమాదకరం కావచ్చని తెలిపింది.
ఇవి లేకుండా ఫార్ములా పాలను తయారు చేయాలని కంపెనీలను కోరినట్లు కన్స్యూమర్ రిపోర్ట్స్ కోరింది.. ఈ నివేదిక కారణంగా తల్లిదండ్రులు భయపడవద్దని, ఫార్ములా మార్చడం గురించి వారి వైద్యుడిని సంప్రదించాలని.. మెరుగైన ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాలని కన్స్యూమర్ రిపోర్ట్స్‌లో ఆహార భద్రత, పరిశోధన నిర్వాహకురాలు సనా ముజాహిద్ అన్నారు.
ఫార్ములా పాలు ఆరోగ్యానికి సురక్షితం కాదా..?
శిశువుల ఫార్ములా పాలలో ఏ స్థాయిలో సీసం ఉన్నా అది ఆరోగ్యానికి సురక్షితం కాదు. పిల్లల ఆరోగ్యానికి సీసం ప్రమాదకరమని అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చెబుతోంది. దీనివల్ల అనేక తీవ్రమైన వ్యాధులు వస్తాయి. 6 నెలల వరకు బిడ్డకు తల్లి పాలు మాత్రమే సురక్షితం. USA Today కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, పరీక్షలో కనుగొనబడిన సీసం వంటి కలుషితాలు వాతావరణంలో ఉన్నాయని, ఆహార పదార్థాలతో సంబంధంలోకి వస్తాయని ముజాహిద్ అంగీకరించారు.. కానీ అవి ఫార్ములా పాలలో పూర్తిగా లేకుండా ఉండాలని ఆయన కోరుతున్నారు.
చాలా నమూనాలలో సీసం..
పరీక్షించిన 41 ఫార్ములా మిల్క్ నమూనాలలో 34 1.2 ppb నుంచి 4.2 ppb వరకు సీసం కలిగి ఉన్నాయని కన్స్యూమర్ రిపోర్ట్స్ కనుగొంది.. వీటిలో అత్యధిక స్థాయిలు ఎన్‌ఫామిల్ న్యూట్రామిజెన్‌లో కనుగొనబడ్డాయి. అయితే, పరీక్షించిన ఫార్ములా మిల్క్ నమూనాలలో ఏదీ సీసం స్థాయిలు నిర్దేశించిన ప్రమాణాలను మించలేదు. కానీ వాటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం కూడా మంచిది కాదు. మరోవైపు, ఫార్ములా మిల్క్ తయారు చేసే కంపెనీలు తాము ఎప్పుడూ ఉద్దేశపూర్వకంగా ఈ రసాయనాలను జోడించలేదని చెబుతున్నాయి. ఇవి వాతావరణంలోనే ఉంటాయి.. అక్కడి నుండి ఆహార పదార్థాలలోకి వెళతాయని చెబుతున్నారు వైద్య నిపుణులు..
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..