Avoid these foods for breakfast: ఉదయాన్నే ఈ పదార్థాలు తీసుకుంటున్నారా… అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే

|

Oct 20, 2021 | 10:16 AM

బాడీ ఫిట్‌గా ఉండాలన్నా, యాక్టివ్‌గా పనిచేస్తూ ముందుకు వెళ్లాలన్నా..  సరైన డైట్ చాలా ఇంపార్టెంట్.

Avoid these foods for breakfast: ఉదయాన్నే ఈ పదార్థాలు తీసుకుంటున్నారా... అయితే మీరు డేంజర్‌లో ఉన్నట్లే
Avoid these foods for breakfast
Follow us on

బాడీ ఫిట్‌గా ఉండాలన్నా, యాక్టివ్‌గా పనిచేస్తూ ముందుకు వెళ్లాలన్నా..  సరైన డైట్ చాలా ఇంపార్టెంట్. ఏది పడితే అది కడుపులోకి తోసేస్తే.. మన బాడీ కూడా మన మాట వినదు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక నోటికి మంచిగా అనిపించేది.. శరీరానికి మంచిది కాదని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. ఇక బ్రేక్ పాస్ట్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే ఉదయం వేళ కడుపు ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో మనం ఏం తిన్నా అది నేరుగా కడుపులోపలి భాగాలపై ఎఫెక్ట్ చూపిస్తోంది. సరైన ఫుడ్ తీసుకోకపోతే..  అజీర్తి, గ్యాస్ ట్రబుల్, కడుపులో మంట, ఛాతీలో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే ఆరోగ్య నిపుణలు కొన్ని ఆహార  పదార్థాలను పొద్దన తినకూడదని చెబుతారు. అందులో కొన్ని ద్రవ పదార్థాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.

  • ప్రధానంగా చెప్పుకోవాల్సింది లిక్కర్. చాలామంది రాత్రి తాగింది దిగలేదని..హ్యాంగోవర్ అంటూ ఉదయాన్నే కూడా మద్యం సేవిస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఎఫెక్ట్ డైరెక్ట్ లివర్‌పైనే ఉంటుంది. అసలు మద్యపానమే హానికరం. అదీ ఉదయాన్నే పరగడపున తాగడమంటే నరకానికి ఎక్స్‌ప్రెస్ టికెట్ తీసుకున్నట్లే.
  • కొంతమంది ఉదయం బ్రేక్‌ఫాస్ట్ కంటే ముందుగానే  కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఈ విధానం కరెక్ట్ కాదు. దీనివల్ల ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి
  • ఉదయం పరగడుపున నీళ్లు తాగమని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సైతం చెబుతారు. అయితే కొందరు లేవగానే ఫ్రిజ్ వద్దకు వెళ్లి కూలింగ్ వాటర్ తాగుతారు. ఇలా చెయ్యడం వల్ల జీర్ణ సమస్యలు ఎదురై..ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది.
  • ఉదయం వేళల్లో మసాలా లేదా ఫ్రై చేసిన ఫుడ్ ఎక్కువ తీసుకోకూడదు.  దీంతో కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తోంది. ఇది మీ రోజువారి పనులపై ప్రభావం చూపుతోంది. అందుకే అల్పాహారంగా లైట్ ఫుడ్ తీసుకోవాలి.
  • ఫైబర్ పదార్ధాలు కడుపుకి మంచివే. కానీ పరిధి దాటి తీసుకుంటే మాత్రం నష్టం చేకూరుస్తాయి. ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే పరిమిత మోతాదులోనే ఫైబర్ పదార్ధాలు తీసుకోవాలి.

(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించబడింది. మీకు ఏ సందేహాలున్నా.. డాక్టర్లను లేదా డైటీషియన్లను సంప్రదించండి)

Also Read: Manchu Manoj: సార్ అంటూనే వర్మకు సాలిడ్ కౌంటర్ ఇచ్చిన మంచు మనోజ్..