Fever: జ్వరం వచ్చినప్పుడు ఈ పుడ్స్ జోలికి అస్సలు వెల్లకండి

|

Aug 17, 2024 | 1:08 PM

ప్రజంట్ ఏ ఆస్పత్రి ముందు చూసినా పెద్ద సంఖ్యలో జ్వరం బాధితులు కనిపిస్తున్నారు. రెయినీ సీజన్ కావడంతో చాలామంది వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు. ఈ సమయంలో తినే ఆహారంపై కూడా శ్రద్ద వహించడం చాలా ముఖ్యం..

Fever: జ్వరం వచ్చినప్పుడు ఈ పుడ్స్ జోలికి అస్సలు వెల్లకండి
Fever
Follow us on

ప్రస్తుతం రెయినీ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ సమయంలో.. కలుషిత నీరు, దోమల వల్ల చాలామంది వైరల్ ఫీవర్స్ బారిన పడుతున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యవంతమైన శరీరం కోసం రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి. అదేవిధంగా, మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే, కోలుకునే విధంగా ఆహారాన్ని తినాలి.

జ్వరం ఉన్నప్పుడు నోటికి రుచి తెలియదు. శరీరం బలహీనంగా మారుతుంది. ఈ సమయంలో మీరు సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలి. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల త్వరగా కోలుకోవచ్చు. అయితే, ఫ్లూ సమయంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. 

జ్వరం వచ్చినప్పుడు మటన్ తినకూడదు. రెడ్ మీట్‌లో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది శారీరక సమస్యలను పెంచుతుంది. అంతేకాదు మటన్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. జ్వరంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. అలాగే పిజ్జా, పాస్తా తినడం మానుకోండి. ఇందులో చీజ్ ఉంటుంది. సోడియం ఎక్కువగా ఉంటుంది. జ్వరంలో ఇలాంటి ఫుడ్స్ తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. 

జ్వరంతో బాధపడుతున్నప్పుడు  బిర్యానీ లాంటి ఫాస్ట్ ఫుడ్ తినకూడదు. బయటి ఆహారంలో.. రుచి కోసం ఉప్పు, నూనె, మసాలాలు ఎక్కువగా వాడుతుంటారు. ఈ రకమైన ఆహారాలు కడుపు సమస్యలను పెంచుతాయి. ఇది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అలాగే కోడి కూర, కోడిగుడ్డు కూర వంటివి తినకూడదు. సులభంగా జీర్ణమయ్యే ఇడ్లీ, రసం అన్నం వంటివి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(ఈ సమాచారం నిపుణుల నుంచి సేకరించి.. ఫాలో అయ్యేముందు డైటీషియన్లను సంపద్రించండి)