AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cholesterol: కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారా?ఉదయాన్నే వీటిని తినండి.. కొవ్వు ఇట్టే కరిగిపోద్ది

Foods For lower cholesterol: రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల పలు గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్తనాళాలు ఇరుకుగా మారిపోయి శరీరమంతా రక్తప్రసరణ సక్రమంగా జరగదు.

Cholesterol: కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారా?ఉదయాన్నే వీటిని తినండి.. కొవ్వు ఇట్టే కరిగిపోద్ది
High Cholesterol
Basha Shek
|

Updated on: Sep 05, 2022 | 10:17 AM

Share

Foods For lower cholesterol: రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల పలు గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల రక్తనాళాలు ఇరుకుగా మారిపోయి శరీరమంతా రక్తప్రసరణ సక్రమంగా జరగదు. దీని వల్ల పలు వ్యాధులు తలెత్తుతాయి. కొన్నిసార్లు కొలెస్ట్రాల్ పరిధీయ ధమనులలో పేరుకుపోతుంది. ఇది గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. అయితే వైద్యుల సలహాలతో పాటు కొన్ని ఇంటి చిట్కాలతో రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు. ముఖ్యంగా ఉదయం పరగడుపునే కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు గింజలు, ఒక టేబుల్ స్పూన్ మెంతులు, రెండు-నాలుగు బాదం గింజలు, అలాగే 8-10 ఎండుద్రాక్షలను అర గిన్నె ఓట్స్‌తో ప్రతిరోజూ రాత్రి నానబెట్టి, ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో తినాలి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో నిల్వ ఉన్న కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షలో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయులను తగ్గిస్తాయి. ఇక ఎండుద్రాక్షలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించే ఫైటోకెమికల్స్, ఫ్లేవనాయిడ్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

బాదంపప్పు

బాదంపప్పులో విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సమర్థంగా పనిచేస్తాయి.

మెంతులు

మెంతుల్లో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా మెంతులు శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయులను పెంచుతాయి. అలాగే ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. తద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇందులో ఫోలిక్ యాసిడ్, రైబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్ వంటి పోషకాలు, ఇనుము, కాల్షియం, కాపర్, పొటాషియం వంటి ఖనిజాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.

పొద్దు తిరుగుడు గింజలు

పొద్దుతిరుగుడు గింజల్లో పలు ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి ఆహారంలో సోయాబీన్స్‌కు బదులుగా సన్‌ఫ్లవర్‌ నూనెను ఉపయోగించడం మంచిది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి.

అవిసె గింజలు

అవిసె గింజలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు,యాంటీ-ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సమర్థంగా పనిచేస్తాయి.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
నవరాత్రుల్లో దుర్గాదేవి ముందు నెయ్యి దీపం వెలిగించాలా? నూనె దీపం
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
తెలంగాణ దావత్ స్టైల్ మటన్ కర్రీ.. ఇంట్లోనే ఈజీగా..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
వానల్లేవు.. ఉపాధి లేదు.. వలస పోతున్న జనం..
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
యమ్మీ యమ్మీగా చిప్స్‌ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? డేంజర్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
పవన్ కల్యాణ్ 30 ఏళ్ల సినీ ప్రస్థానం..అల్లు అరవింద్ స్పెషల్ విషెస్
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
విండీస్ సిరీస్‌తోనే కెరీర్ క్లోజ్.. టీమిండియాలో ఇకపై నో ఛాన్స్..!
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
మోకులేకుండా తాటిచెట్టుపైకి..గీతకార్మికులను ఆశ్చర్యపరుస్తున్న రైతు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
దసరా స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి 25కు పైగా సినిమాలు
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
ఇంట్లో కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలతో ఇలా చేయండి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి
అరుదైన గౌరవం.. ఆర్థిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్‌ బహుమతి