Health Benefits of Eating Eggs: పోషకాహారం తీసుకోవాలనుకునే వారు ఎక్కువుగా కోడి గుడ్లు తీసుకుంటారు. అయితే బరువు తగ్గాలనుకునే వారు కూడా గుడ్లు తినాలని, అయితే తినే విధానం కూడా చాలా ముఖ్యమంటున్నారు పోషకాహార నిపుణులు. ఊబకాయం అనేది శరీరంలో అనేక వ్యాధులకు దారితీసే సమస్య. స్థూలకాయం వల్ల శరీరంలో అనేక వ్యాధులు కూడా వస్తాయి. బరువు పెరుగడం వల్ల మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే స్థూలకాయంతో బాధపడుతున్న వారు కూడా.. బరువు తగ్గడానికి రోజూ గుడ్లు తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఏ సమయంలో ఎలా తినాలనేది కీలకమని సూచిస్తున్నారు. గుడ్డు అనేది ప్రోటీన్లు, విటమిన్లు, ఒమేగా-3 వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన పౌష్టిక ఆహారం. బరువు తగ్గడానికి ప్రతిరోజూ అల్పాహారంగా గుడ్లు తినొచ్చు. దీని వల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లు అందుతాయని అంటున్నారు నిపుణులు.
అనేక విధాలుగా గుడ్లు తినవచ్చు. ఉడకబెట్టి, ఆమ్లెట్, భుర్జీ, గుడ్డు కూర చేసి తినవచ్చు. గుడ్లు తింటే చాలా సేపు ఆకలిగా అనిపించదు. మీరు త్వరగా బరువు తగ్గాలంటే, గుడ్డులో ఈ 3 పదార్థాలను కలిపి తినాలని సూచిస్తున్నారు. గుడ్లు ప్రోటీన్‌కు అద్భుతమైన మూలం. గుడ్లు తక్కువ కేలరీలు, అధిక ప్రోటీన్ కలిగి ఉంటాయి. గుడ్లు సరైన నిష్పత్తిలో అన్ని అవసరమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. కాబట్టి శరీరాలు వాటిలోని ప్రోటీన్‌ను పూర్తిగా ఉపయోగించుకోవడానికి సహాయం చేస్తాయి. తగినంత ప్రోటీన్ తినడం బరువు తగ్గడానికి, రక్తపోటును తగ్గించడానికి, ఎముక ఆరోగ్యాన్ని ఆప్టిమైజ్ చేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రతిరోజూ ఒక గుడ్డును తినడం మంచిది. అల్పాహారంగా వీటిని తీసుకోవచ్చు. ఇది రోజులో అత్యంత ముఖ్యమైన భోజనం కూడా అవుతుంది. ఖనిజాలు, విటమిన్లలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ కచ్చితంగా మెరుగైనదనే చెప్పుకోవాలి. గుడ్లు జీవక్రియను పెంచుతాయి. ఎగ్స్ శరీరానికి అవసరమైన అన్ని ముఖ్యమైన అమైనో ఆమ్లాల మంచి సమతుల్యతను కలిగి ఉంటాయి. అంటే శరీరం గుడ్లలోని ప్రోటీన్‌ను నిర్వహణ, జీవక్రియ కోసం సులభంగా ఉపయోగించవచ్చు. గుడ్లతో రెసిపీలు తయారు చేయడం చాలా సులభం. ఈ సూపర్‌ఫుడ్‌ను ఎన్నో విధాలుగా తయారు చేసుకోవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..