Beauty Tips:ఈ రోజుల్లో చాలామందిలో చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వచ్చేస్తున్నాయి. దీనికి కారణం పొడి చర్మం, అధిక ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, ధూమపానం, నిద్ర లేకపోవడం మొదలైనవి ఉన్నాయి. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే కొన్ని ఇంటి చిట్కాలతో వీటిని దూరం చేసుకోవచ్చు. వీటిని ప్రయత్నించిన తర్వాత ఒక వారంలో మీరు చక్కటి ఫలితాలని చూస్తారు. అలాంటి వాటి గురించి తెలుసుకుందాం.
కలోంజి ఆయిల్
కలోంజి ఆయిల్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముడతల సమస్యను తొలగించడంలో సహాయపడతాయి. ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర టీస్పూన్ కలోంజి ఆయిల్ కలపండి. ఈ నూనెతో మెడ నుంచి ముఖం వరకు 15 నిమిషాల పాటు మసాజ్ చేయండి. రోజూ రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే చక్కటి ఫలితాలని చూస్తారు.
అవోకాడో ఆయిల్
అవకాడో ఆయిల్ ముడతలని తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఏజింగ్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి పూసిన వెంటనే ప్రభావం చూపుతుంది. చర్మం లోపలి పొరకు చేరుకుంటుంది. దెబ్బతిన్న కణాలను సరిచేయడం ప్రారంభిస్తుంది. ఇది మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. చర్మాన్ని లోపలి నుంచి బిగుతుగా చేస్తుంది. రోజూ రాత్రి పడుకునే ముందు దీనిని అప్లై చేయాలి. చక్కటి ఫలితాలని చూడవచ్చు.
పప్పు ప్యాక్
చర్మాన్ని బిగుతుగా చేయడానికి పప్పు ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ చేయడానికి అరకప్పు పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసి అందులో టొమాటో రసం కలపాలి. ఈ పేస్ట్‌ను మెడ నుంచి ముఖం వరకు అప్లై చేయాలి. తర్వాత ఎవరితోనూ మాట్లాడకండి, నవ్వకండి. ప్రశాంతంగా ఉండండి. కళ్ళు మూసుకోండి. ఆరిన తర్వాత ఫేస్ ప్యాక్ ను సాధారణ నీటితో కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే ముఖంపై చర్మం బిగుతుగా మారుతుంది.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి