Health Tips: ఈ లక్షణాలు మీలో కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త.. వెంటనే అప్రమత్తం కాకపోతే అంతే సంగతి..

|

May 06, 2023 | 3:04 PM

Health Tips: మన చుట్టూ ఉన్న సమాజంలో చాలా మంది వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీటికి మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పాటు పోషకాహార లోపం కూడా ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల..

Health Tips: ఈ లక్షణాలు మీలో కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త.. వెంటనే అప్రమత్తం కాకపోతే అంతే సంగతి..
Symptoms of Vitamin B12 Deficiency
Follow us on

Health Tips: మన చుట్టూ ఉన్న సమాజంలో చాలా మంది వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. వీటికి మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లతో పాటు పోషకాహార లోపం కూడా ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల విటమిన్లు నిత్యం శరీరానికి అవసరమవతుంటాయి. అలాంటివాటిలో విజమిట్ బీ12 కూడా ప్రముఖమైనది. శరీరం తనంతట తాను విటమిన్ బీ12ని ఉత్పత్తి చేయలేదు. అంటే ఆహారం ద్వారానే మనం బీ12 విటమిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ విటమిన్ బీ12 అనేది జంతు మాంసం, పాల ఉత్పత్తులు, చేప మాంసం, గుడ్ల నుంచి పుష్కలంగా 12 లభిస్తుంది. వెజిటేరియన్లు, వేగన్స్ అయితే సప్లిమెంట్ల ద్వారా  లేదా విటమిన్ బీ 12 కలిపిన బలవర్థక ఆహారం ద్వారా పొందవచ్చు.

అయితే విటమిన్ బీ12 శరీరంలో తగినంతగా లేకపోతే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. విటమిన్ బీ12 లోపం వల్ల కొన్ని రకాల గుండె జబ్బులు కూడా తలెత్తుతాయి. విటమిన్ బీ12 లేని ఆహారం తీసుకోకపోవడం, లేక ఈ విటమిన్‌ను శరీరం శోషించలేకపోవడం వల్ల ఈ వ్యాధులు తలెత్తుతాయి. అలాగే కొన్ని రకాల లక్షణాలు ద్వారా విటమిన్ బీ12 లోపాన్ని గుర్తించవచ్చు. మరి విటమిన్ బీ12 లోపం కారణంగా శరీరంలో కనిపించే లక్షణాలేమిటో ఇప్పుడు చూద్దాం..

విటమిన్ బీ 12 లోపం లక్షణాలు

రక్తహీనత: రక్తహీనతకు విటమిన్ బీ12 లోపమే ప్రధాన కారణం. శరీరంలో రక్తహీనత లేకపోతే వెంటనే అలసిపోవడం, కళ్లు తిరగడం, పీలగా మారిపోవడం వంటివి జరుగుతాయి.

ఇవి కూడా చదవండి

మూడ్ స్వింగ్స్: విటమిన్ బీ12 లోపం వల్ల మానసికంగా మీరు అందోళన చెందడం, భావోద్రేకానికి గురికావడం వంటివి జరుగుతుంటాయి. ఈ క్రమంలో మీరు చిన్న సమస్యలకే టెన్షన్ పడడం, కంగారు, మానసికంగా కృంగిపోవడం వంటివి ఎదుర్కొంటారు.

జ్ఞాపకశక్తి సమస్యలు: బీ12 విటమిన్ లోపం ఏర్పడితే కలిగే మరో సమస్య జ్ఞాపకశక్తి  లోపించడం లేదా మతిమరుపు. కొన్ని సందర్భాలలో మీరు మీ కుటుంబ సభ్యులను కూడా గుర్తుపట్టలేనట్లుగా ప్రవర్తిస్తారు

కండరాల బలహీనత: విటమిన్ బీ12 లోపం ఉంటే మీ కండరాలు బలహీనంగా మారుతాయి. చిన్న చిన్న వస్తువలను పట్టుకోవడంలో కూడా మీకు ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది.

అలసట, చెమటలు: విటమిన్ బీ 12 లోపం కారణంగా రాత్రిపూట మీరు ఎంత గాలి వీచే ప్రదేశంలో ఉన్నా చెమటలు పడుతుంటాయి. ఇంకా వెంటవెంటనే తీవ్రమైన అలసటను అనుభూతి చెందుతారు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..