Sleepwalking : నిద్రలో నడుస్తున్నారా..అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే…డాక్టర్లు ఏం చెబుతున్నారంటే..
నిద్రలో నడుస్తున్నారా.. మీకు తెలియకుండానే అర్ధరాత్రి పూట నిద్రలోంచి సడన్గా లేచి ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నారా. అయితే ఇది ఖచ్చితంగా మీ మానసిక సమస్యే.. అని గుర్తించండి.

నిద్రలో నడుస్తున్నారా.. మీకు తెలియకుండానే అర్ధరాత్రి పూట నిద్రలోంచి సడన్గా లేచి ఇంట్లో అటు ఇటు తిరుగుతున్నారా. అయితే ఇది ఖచ్చితంగా మీ మానసిక సమస్యే.. అని గుర్తించండి. అయితే సినిమాల్లో నిద్రలో నడుచుకుంటూ వెళ్లి చాలా దూరం వెళుతున్నట్టు మనకు చూపిస్తూ ఉంటారు. సాధారణంగా చాలా మందిలో బాత్రూం కి వెళ్లడం, మంచినీళ్లు తాగడం వంటివి చేసి మళ్ళీ తిరిగి వచ్చి నిద్రపోతూ ఉంటారు కానీ తెల్లవారు లేచిన తర్వాత ఆ విషయం వారికి పూర్తిగా గుర్తు ఉండదు. నిజానికి నిద్రలో నడిచే అలవాటు ప్రతి ఒక్కరిలోనూ కొద్దిగా ఉంటుంది. కానీ ఈ సమస్య కొద్ది మందితో మాత్రమే జటిలంగా మారుతుంది. దీనిపై పలువురు పల్మనాలజిస్టులు స్లీప్ స్పెషలిస్టులు అనేక ఇంట్రెస్టింగ్ విషయాలను బయట ప్రపంచానికి వెలుగులోకి తెస్తున్నారు.
బెంగళూరుకు చెందిన ఫోర్టీస్ ఆసుపత్రిలో పల్మనాలజిస్ట్ గా పని చేస్తున్న డాక్టర్ సచిన్ ఈ నిద్రలో నడక గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. స్లీప్‌వాకింగ్‌లో “దుస్తులు మార్చుకోవడం, ఆహారం తినడం, ఇల్లు శుభ్రం చేయడం, పరిగెత్తడం, తెలియని ప్రదేశాలలో మూత్ర విసర్జన చేయడం” వంటి సంక్లిష్టమైన చర్యలు కూడా ఉంటాయి. “కొందరు నిద్రలో ఉన్నప్పుడు లైంగిక కార్యకలాపాలు, డ్రైవింగ్, హింసాత్మక కార్యకలాపాలలో కూడా పాల్గొనవచ్చు. సాధారణంగా నిద్రలో నడవడం అనేది రోగి తీవ్రతను బట్టి కొద్ది నిమిషాల నుండి అరగంట వరకు ఉంటుంది. నిద్రలో నడిచిన వ్యక్తి స్వయంగా తిరిగి పడుకోవచ్చు. తిరిగి మేల్కొన్నప్పుడు గందరగోళం చెందవచ్చు మరియు ఎపిసోడ్ గుర్తుకు రాకపోవచ్చు.
స్లీప్‌వాకింగ్‌ని ఎలా నిర్ధారణ చేయవచ్చు?




డాక్టర్ మీ లక్షణాలు, వైద్య చరిత్ర గురించి అడుగుతారు.వారు కొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది.
*శారీరక పరిక్ష.
*నిద్ర అధ్యయనం (పాలిసోమ్నోగ్రఫీ). మీరు స్లీప్ ల్యాబ్‌లో రాత్రంతా గడుపుతారు, ఇక్కడ మీరు నిద్రిస్తున్నప్పుడు మీ హృదయ స్పందన రేటు, మెదడు తరంగాలు, కదలికలు వంటి వాటిని రికార్డ్ చేస్తారు.
* మీ మెదడు కార్యాచరణను అధ్యయనం చేయడానికి EEG (అరుదైన సందర్భాలు). నిర్వహిస్తారు.
చికిత్స
స్లీప్ వాకింగ్ చికిత్సలో సాధారణంగా నిద్ర నాణ్యతను మెరుగుపరచడం, ఆల్కహాల్, డ్రగ్స్‌కు దూరంగా ఉండటం, ఒత్తిడిని తగ్గించడం, క్రమబద్ధమైన నిద్ర షెడ్యూల్‌ను ఉంచుకోవడం వంటి జీవనశైలి మార్పులను డాక్టర్లు సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో మందులు కూడా సూచించవచ్చు.
“స్లీప్ మెడిసిన్ స్పెషలిస్ట్‌ను సంప్రదించడం ద్వారా లక్షణాలు, తీవ్రత ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా చికిత్స పొందడం చాలా ముఖ్యం, నిద్రలో నడవడం వల్ల సమస్యలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం



