Gold Health Benefits: బంగారు ఆభరణాలతో అందం మాత్రమే అనుకుంటున్నారా.. రోగాలు కూడా నయమవుతాయి.. ఎలానో తెలుసా..
ఆయుర్వేదంలో బంగారానికి విశేషమైన ప్రధాన్యత ఉంది. బంగారంను స్వర్ణ భస్మం రూపంలో ఉపయోగిస్తారు. నేరుగా బంగారు ఆభరణాలను ధరించడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనలో చాలా మందికి తెలియదు. మనం బంగారు ఆభరణాలను విలాసం, సాంప్రదాయంలో భాగంగా ధరిస్తుంటాం. ఎందుకంటే ఇది శరీరానికి అనేక ఔషధ ప్రయోజనాలను అందిస్తుంది.

బంగారంలో అనేక ఔషధ గుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇది చాలా అధ్యయనాల్లో వెల్లడైంది. పూర్వ కాలంలో రాజులు, చక్రవర్తులు,రాణులు బంగారు ఆభరణాలను ధరించేవారు. రాణులు తమ చర్మానికి అంటుకునే ఆభరణాలను ధరించేవారు. ఎందుకంటే బంగారం మొత్తం ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం బంగారు ఆభరణాలను శరీరానికి దగ్గరగా ధరించాలి. ఎందుకంటే ఇది శరీరానికి అనేక ఔషధ ప్రయోజనాలను అందిస్తుంది. అంతే కాదు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
అంతెందుకు ఆయుర్వేదంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయుర్వేద మందుల్లో బంగారంను నేరుగా ఉపయోగించకుండా.. బంగారంను భస్మంగా మార్చి స్వర్ణ భస్మంలా వాడుతుంటారు. స్వర్ణ భస్మం నానో, కొల్లాయిడ్ బంగారు కణాలను కలిగి ఉన్న సాంప్రదాయ ఆయుర్వేద ఔషధం. ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్, మధుమేహం, నాడీ వ్యవస్థ సంబంధిత వ్యాధుల చికిత్సకు శతాబ్దాలుగా మనదేశంలో ఉపయోగించబడుతోంది.
ఇది 98 శాతం వరకు బంగారు రేణువులను కలిగి ఉన్నందున ఇది ఆయుర్వేదంలో అత్యంత ఖరీదైన ఔషధాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. పూర్వ కాలంలో బంగారం ఉనికిని పునరుజ్జీవింపజేసే, కామోద్దీపన వంటి అనేక చికిత్సా విలువలను అందించడానికి, జీవిత కాలం దీర్ఘాయువును పెంచడానికి ఉపయోగించేవారు. ఈ విషయాన్ని కాసేపు పక్కన పెడితే.. నిత్యం మనం వినియోగించే బంగారు ఆభరణాల వినియోగంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..
1. రక్త ప్రసరణలో మెరుగుదల: రక్త ప్రసరణను ప్రోత్సహించడానికి బంగారం పనిచేస్తుంది. ఒక వ్యక్తి బంగారు ఆభరణాలను ధరించినప్పుడు.. శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. బంగారాన్ని ధరించడం గరిష్ట ప్రయోజనం శరీరంలోని ఆ భాగానికి ఇవ్వబడుతుంది. అక్కడ బంగారం ధరిస్తారు.
2. శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది: బంగారం ధరించడం వల్ల శరీరానికి రిలాక్సేషన్ లభిస్తుంది. తలనొప్పిని కూడా తగ్గించుకోవచ్చు. చేతి చూపుడు వేలులో ప్రెజర్ పాయింట్ ఉండడం వల్ల తలనొప్పి తగ్గుతుందని చెబుతారు. మీరు రింగ్ ధరించినప్పుడు, ఈ ప్రెజర్ పాయింట్‌పై ఒత్తిడి ఉంటుంది.
3. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది: శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే సామర్ధ్యం బంగారానికి ఉందని నమ్ముతారు. ఇది శరీర ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గుల నుంచి వ్యక్తిని రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కూడా పనిచేస్తుంది.
4. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది: బంగారంతో చేసిన నగలు మానసిక స్థితిని పెంచడానికి పని చేస్తాయి. బంగారు ఆభరణాలు ధరించడం ద్వారా ఒక వ్యక్తి తనను తాను మరింత ఆకర్షణీయంగా మార్చుకుంటాడు. అంతేకాదు వారిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.
5. చర్మం మెరిసేలా చేయడంలో సహాయకారిగా ఉంటుంది: ఈ రోజుల్లో బంగారాన్ని వివిధ సౌందర్య చికిత్సలలో ఉపయోగిస్తున్నారు. బంగారం వాడటం వల్ల ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా చర్మం యవ్వనంగా ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ న్యూస్ కోసం




