మీకు ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే అల్జీమర్స్ కావొచ్చు..! ఒక్కసారి చెక్ చేసుకోండి..

Alzheimers Symptoms : అల్జీమర్స్ జ్ఞాపకశక్తిని నాశనం చేసే వ్యాధి. ఇది ఎక్కువగా వయసుపైబడిన వారిలో వస్తుంది. అల్జీమర్స్ ఉన్న వ్యక్తికి

మీకు ఈ లక్షణాలు ఉన్నాయా..? అయితే అల్జీమర్స్ కావొచ్చు..! ఒక్కసారి చెక్ చేసుకోండి..
Alzheimers Symptoms
Follow us
uppula Raju

|

Updated on: May 19, 2021 | 10:19 PM

Alzheimers Symptoms : అల్జీమర్స్ జ్ఞాపకశక్తిని నాశనం చేసే వ్యాధి. ఇది ఎక్కువగా వయసుపైబడిన వారిలో వస్తుంది. అల్జీమర్స్ ఉన్న వ్యక్తికి వృద్ధాప్యం గుర్తుకు రావడం చాలాకష్టం. అతడు తనకు కావలసిన ముఖ్యమైన వ్యక్తులను కూడా మరిచిపోతాడు. క్రమక్రమంగా ఇది పెరుగుతుంది. అల్జీమర్స్ జ్ఞాపకశక్తి కోల్పోవటంతో సహా అనేక ఇతర లక్షణాలను కలిగి ఉంటుంది. మొదట వ్యక్తుల పేర్లను మరచిపోవడం, ఆలోచనలను వ్యక్తపరచడంలో ఇబ్బంది, సూచనలను పాటించడంలో ఇబ్బంది, ఏదైనా అర్థం చేసుకోవడంలో ఇబ్బంది వంటివి కనిపిస్తాయి.

అల్జీమర్స్‌కు కారణం వయస్సుతో పాటు మెదడు కణాలు బలహీనపడటం. ఇది జ్ఞాపకశక్తి, మానసిక పనితీరు తగ్గడానికి దారితీస్తుంది. ఇది ఒక సాధారణ వ్యాధి. ఈ సమస్యను దాని కారణాలు తెలుసుకొని నియంత్రణ ద్వారా అధిగమించవచ్చు. మీ వైద్యుడిని తప్పక సంప్రదించాలి. స్మృతి లేదా మతిమరుపు వ్యాధి ప్రారంభ లక్షణం. మీరు దానిని గ్రహించవచ్చు. క్రమంగా ఇది వ్యక్తిని బలహీనపరుస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు ప్రతి ఒక్కరికీ జ్ఞాపకశక్తి తగ్గుతుంది కానీ అల్జీమర్ వచ్చినవారికి అలా ఉండదు. వారి పరిస్థితి రోజు రోజుకు తీవ్రమవుతోంది.

రోగికి ఈ క్రింది లక్షణాలు ఉంటాయి.. 1. తరచుగా ఒక విషయాన్ని పదే పదే చెప్పడం.. 2. సంభాషణ, అపాయింట్‌మెంట్, ఈవెంట్లను మరిచిపోవడం 3. పోగొట్టుకున్న వస్తువును కనుగొనలేకపోవడం 4. సొంత స్థలం లేదా ఇంటిని మరచిపోవటం 5. కుటుంబ సభ్యుల పేర్లు, రోజువారీ విషయాలను మరచిపోవటం 6. వస్తువులను గుర్తించడానికి, ఆలోచనలను వ్యక్తీకరించడానికి లేదా కమ్యూనికేట్ చేయడానికి పదాలను కనుగొనడంలో ఇబ్బంది. 7. ఏకాగ్రత పెట్టడం, ఆలోచించడంలో ఇబ్బంది 8. ఒకేసారి చాలా పనులు చేయడంలో ఇబ్బంది 9. సకాలంలో బిల్లు చెల్లించడం మరిచిపోవడం. 10. చేసే పనిని ప్లాన్ చేయలేకపోవడం 11. నెమ్మదిగా పరిస్థితి ఇలా మారుతుంది. ఈ వ్యాధి ఉన్నవారు దుస్తులు ధరించడం, స్నానం చేయడం కూడా మర్చిపోతారు. 12. వ్యక్తిత్వం, ప్రవర్తనలో మార్పులు

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి.. పై లక్షణాలు ఏవైనా కనిపిస్తే వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించాలి. సీనియర్ సిటిజన్ పరిస్థితి గురించి వైద్యుడితో చర్చించి పరిష్కారం కనుగొనడం మంచిది.

పెరుగుతో కలిపి ఇవి తింటే చాలా డేంజర్..! లిస్టులో ఏ ఏ పదార్థాలు ఉన్నాయో తెలుసుకోండి..

రైలు చివరన X అని ఎందుకు రాస్తారు..! చిన్న బోర్డుపై ఉండే LV అక్షరాల అర్థం ఏంటి..? తెలుసుకోండి..

దేశంలో అత్యంత భయంకరమైన రైల్వే స్టేషన్లు ఇవే..! ఒక్కో స్టేషన్‌కి ఒక్కో చరిత్ర.. తెలుసుకోండి..