Fatty Liver: ఫ్యాటీ లివర్ తో డయాబెటిస్ వచ్చే ప్రమాదం.. ఆహార నియామాలు..వ్యాయామంతోనే నివారణ సాధ్యం

Fatty Liver: ఫ్యాటీ లివర్ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఆహారం, జీవనశైలిలో ఆటంకాల కారణంగా ప్రజలలో వేగంగా పెరుగుతోంది.

Fatty Liver: ఫ్యాటీ లివర్ తో డయాబెటిస్ వచ్చే ప్రమాదం.. ఆహార నియామాలు..వ్యాయామంతోనే నివారణ సాధ్యం
Faty Liver
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jun 04, 2021 | 3:01 PM

Fatty Liver: ఫ్యాటీ లివర్ డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి. ఫ్యాటీ లివర్ సమస్య ఆహారం, జీవనశైలిలో ఆటంకాల కారణంగా ప్రజలలో వేగంగా పెరుగుతోంది. ఫ్యాటీ లివర్ విషయంలో మొదట జీవనశైలి ప్రభావితం అవుతుంది. తరువాత మధుమేహం వస్తుంది. ఫ్యాటీ లివర్ అనేది సాధారణంగా మద్యం తాగే వారిలో ఎక్కువ కనిపిస్తుంది. కానీ, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, మద్యం తాగని వారిలో కూడా ఈ సమస్య వేగంగా పెరుగుతోంది. దీనిని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అంటారు.

ఇండోర్ లోని టోటల్ డయాబెటిస్ హార్మోన్ ఇన్స్టిట్యూట్, డయాబెటిస్ అండ్ హార్మోన్ నిపుణుడు డాక్టర్ సునీల్ ఎం. జైన్ ఫ్యాటీ లివర్ సమస్యను ఎలా ఎదుర్కోవచ్చనే విషయాన్ని వివరించారు. ఆయన చెప్పిన దాని ప్రకారం..

ఫ్యాటీ లివర్ ఉందని తెలుసుకోవడానికి ప్రధానంగా రెండు లక్షణాలు చెబుతున్నారు. దీని ఆధారంగా శరీరంలో చక్కెరకు సంబంధించిన రసాయన మార్పులను అంచనా వేయవచ్చు. బొడ్డు చుట్టూ కొవ్వు పెరగడం అలాగే మెడ వెనుక భాగంలో చర్మం నల్లబడటం ఫ్యాటీ లివర్ ఉన్నవారిలో బహిర్గతంగా కనిపించే ముఖ్య లక్షణాలు. చక్కెర అధికంగా ఉండే ఆహారాలు , శీతల పానీయాలు, చక్కెర, స్వీట్లు, చాక్లెట్, బంగాళాదుంపలు, జంక్ ఫుడ్, తియ్యటి పండ్లు, పెరుగు మొదలైనవి తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వీటికి మద్యం.. నాన్ వెజ్ తోడైతే మరింత ప్రమాదంగా మారుతుంది.

ఫ్యాటీ లివర్ నుంచి రక్షణ కోసం..

ప్రస్తుతం ఉన్న బరువులో కనీసం 8% బరువు తగ్గాలి. మీరు ఆహారం నుండి తీపి పదార్ధాలను తీసివేసి, ప్రతిరోజూ వ్యాయామం చేయడం ద్వారా మీ బరువును 8 శాతం తగ్గించుకుంటే, కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వును తగ్గించవచ్చు. ఆహారంలో తృణధాన్యాలు, వోట్స్, పండ్లు, కూరగాయలు మరియు పప్పుధాన్యాలు వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఉండాలి. చక్కెర, పాస్తా, వైట్ బ్రెడ్ మానుకోండి. మీరు డయాబెటిస్ అయితే నడక తప్పనిసరిగా ఉండాలి. ఊబకాయం లేదా అధిక బరువు ఉన్నవారిలో డయాబెటిస్ వచ్చే అవకాశం 80 నుండి 85 శాతం ఎక్కువ. హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం, డయాబెటిస్ ఉన్నవారు వారానికి కనీసం 2 గంటలు నడిచిన వారు.. నడవని మధుమేహ వ్యాధిగ్రస్తుల కంటే గుండెపోటుతో చనిపోయే అవకాశం చాలా తక్కువ.

ఫ్యాటీ లివర్ కొద్ది మొత్తంలో కనిపించినపుడే జాగ్రత్త పడాల్సి ఉంటుంది. లేకపోతే మధుమేహంతో పాటు క్రమేపీ లివర్ ఎన్ లార్జ్ అయ్యే ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వారికి లివర్ ఎన్ లార్జ్ అయినట్టయితే, చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ఫ్యాటీ లివర్ ప్రారంభ లక్షణాలు కనిపించిన వెంటనే ఆహార నియమాలు పాటించడం, జీవన శైలిలో మార్పుల ద్వారా దానిని కంట్రోల్ చేసే ప్రయత్నాలు చేయాలి.

Also Read: Covid -19: పిల్లల మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. ఈ 5 ఆహార పదార్థాలు తప్పనిసరి..!

Immunity Booster Food: ఈ ఐదింటిని రోజూ తీసుకోండి.. ఇమ్యూనిటీని పెంచుకోండి..