ఈ డిజిటల్ ప్రమాదంలో మొబైల్ వాడకం ఎక్కువైపోయింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్‌లలో మునిగిపోతున్నారు. యువత ఉదయం లేచింది నుంచి రాత్రి పడుకోబోయే వరకు స్మార్ట్‌ఫోన్‌లో ఉండిపోతున్నారు. ఇలా మొబైల్ వాడకం కారణంగా కంటి చూపు మందగిస్తుందని కంటి వైద్య నిపుణులు చెబుతున్నారు. మొబైల్ స్క్రీన్‌ను ఎక్కువ సేపు చూస్తుండటం, టీవీలను దగ్గరగా చూస్తుండటం కూడా కంటి చూపుపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. అవి మన ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తాయి. ముఖ్యంగా కళ్ల ఆరోగ్యానికి ఈ గాడ్జెట్లు చాలా ప్రమాదకరమని రుజువవుతోంది. వాటి స్క్రీన్ లైట్ మన కళ్లకు హాని కలిగిస్తుంది. దీని వల్ల అన్ని రకాల సమస్యలు వస్తాయి. ఇలాంటి చెడు జీవనశైలి కారణంగా మన కళ్లు బలహీనంగా మారడం వల్ల ప్రతిరోజూ కళ్లలో మంట, దురద వంటి సమస్యలు మొదలై కంటిచూపు మందగించే అవకాశాలు కూడా ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కళ్లను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని కంటి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
స్క్రీన్‌పై ఎక్కువసేపు కంటిన్యూగా పని చేయడం వల్ల కంటి సమస్య పెరుగుతుంది. ఎక్కువ గంటలు పని చేయకుండా మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోండి. సమయం తక్కువగా ఉంటే మీరు 20-20 నియమాన్ని పాటించడం ద్వారా కళ్లను కూడా విశ్రాంతి తీసుకోవచ్చు. దీని కోసం, స్క్రీన్‌పై 20 నిమిషాలు పనిచేసిన తర్వాత, మధ్యలో విరామం తీసుకోండి. 20 సెకన్ల పాటు స్క్రీన్ నుండి దూరంగా ఉండండి. ఈ సమయంలో పదేపదే కళ్ళు మూసుకోండి. దీంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. కళ్లలో చికాకు ఉంటే చల్లటి నీటితో కడగడం ఎంతో మేలు కలుగుతుంది. కళ్లను శుభ్రం చేయడానికి రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి