Kidney Health: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే ఆపరేషన్ అవసరం లేదు..

నీరు సరిగ్గా తకకపోయినా, అధిక బరువు, డయాబెటిస్‌ సమస్య ఉన్నవారికి, శారీరక శ్రమ లేకపోయినా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. శరీరంలో విటమిన్‌ బీ6, సీ లోపం, విటమిన్‌ డి అధికంగా ఉన్నా ఈ సమస్య వస్తుంది. మద్యం తాగే..

Kidney Health: కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే ఆపరేషన్ అవసరం లేదు..
Kidney Stones

Updated on: Nov 16, 2022 | 10:00 PM

మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ (Kidney) ఒకటి. శరీరంలో చేరుకునే ఆహారాన్ని ఫిల్టర్ చేసి, ఎప్పటికప్పుడు వ్యర్థాలను బయటకు పంపడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటి పనితీరు బాగుంటేనే ఇతర అవయవాలు సరిగ్గా పని చేస్తాయి. మన శరీరంలో వ్యర్థాలను వడగట్టడంలో కిడ్నీలకు రకరకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కిడ్నీలో రాళ్ల గురించి. ప్రస్తుత కాలంలో కిడ్నీలో రాళ్లతో బాధపడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. యూరిన్‌లో లిక్విడ్‌, సాలిడ్‌ కంపోనెంట్స్‌ రెండూ ఉంటాయి. సాలిడ్‌ కంపోనెంట్‌లో సోడియం, పొటాషియం, యూరిక్‌ యాసిడ్‌, కాల్షియంతో పాటు రకరకాల పదార్థాలుంటాయి. ఇవి యూరిన్ లో కరగకుండా ఉంటే అవి చిన్న చిన్న రేణువులుగా మారతాయి. మంచినీళ్లు తాగకుండా ఉండే సరికి అవి మరింత పెద్దగా మారి రాళ్లుగా తయారవుతాయి. సాధారణంగా ఆక్జలేట్‌ లేదా ఫాస్ఫరస్‌లతో క్యాల్షియం కలవటం వల్ల రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

నీరు సరిగ్గా తకకపోయినా, అధిక బరువు, డయాబెటిస్‌ సమస్య ఉన్నవారికి, శారీరక శ్రమ లేకపోయినా కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. శరీరంలో విటమిన్‌ బీ6, సీ లోపం, విటమిన్‌ డి అధికంగా ఉన్నా ఈ సమస్య వస్తుంది. మద్యం తాగే అలవాటు, కిడ్నీలకు ఇన్‌ఫెక్షన్లు వస్తున్నా, కణితులు ఉన్నపుడు కూడా రాళ్లు ఏర్పడతాయి.

ఆలివ్‌ ఆయిల్, నిమ్మరసం కాంబినేషన్‌ కిడ్నీలో రాళ్లను కరిగిస్తుంది. ఈ మేరకు హార్వర్డ్ హెల్త్ నివేదిక వెల్లడించింది. కిడ్నీ స్టోన్స్‌ ఉన్నవారు ఆ సమస్య తగ్గేవరకు ఈ కాంబినేషన్ తాగితే మంచిది. నిమ్మరసం రాళ్లను విచ్ఛిన్నం చేస్తే, ఆలివ్ ఆయిల్ రాళ్లు బయటకు వెళ్లేందుకు లూంబ్రికెంట్ గా పని చేస్తాయి. యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే టాక్సిన్స్ బయటకు వెళ్లి కిడ్నీలు శుభ్రంగా మారతాయి. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్న వారు రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను రోజూ గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దానిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు రోగనిరోధక శక్తిని మెరుగుపరిచి కిడ్నీలో రాళ్లను బయటకు పంపిస్తాయి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే, పూర్తి వివరాల కోసం వైద్య నిపుణులను సంప్రదించాలి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం