AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా.. కోపం, చిరాకు ఇబ్బంది కలిగిస్తున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..

మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉన్నట్లు భావించినట్లయితే మీరు ఎమోషనల్ గా ఇబ్బంది పడుతున్నారని గ్రహించాలి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మనం కొన్ని పద్ధతులు పాటించాలి. వ్యసనాన్ని అధిగమించడానికి మీకు బాగా తెలిసిన, నమ్మదగిన వ్యక్తిని తోడుగా ఉండేలా చూసుకోవాలి.

భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా.. కోపం, చిరాకు ఇబ్బంది కలిగిస్తున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..
Emotions
Basha Shek
|

Updated on: Jan 10, 2023 | 10:10 PM

Share

భావోద్వేగాలు అనేవి అందరిలో ఉంటాయి. కోపం, బాధ, సంతోషం, ప్రేమ, భయం.. ఇవన్నీ మానసిక చర్యలు. మనలో చాలా మంది రోజంతా రకరకాల భావోద్వేగాలకు గురవుతుంటారు. భావోద్వేగంగా ఉండటం ప్రతికూల లక్షణం కానప్పటికీ అది మీ జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. మీరు మీ భావోద్వేగాలు నియంత్రించుకునే సామర్థ్యం కలిగి ఉండకపోతే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. భావోద్వేగ వ్యసనం అనేది వ్యసనపరులు వారి భావోద్వేగాలపై ఆధారపడే స్థితి. మిమ్మల్ని మీరు ఒంటరిగా ఉన్నట్లు భావించినట్లయితే మీరు ఎమోషనల్ గా ఇబ్బంది పడుతున్నారని గ్రహించాలి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు మనం కొన్ని పద్ధతులు పాటించాలి. వ్యసనాన్ని అధిగమించడానికి మీకు బాగా తెలిసిన, నమ్మదగిన వ్యక్తిని తోడుగా ఉండేలా చూసుకోవాలి. ప్రవర్తనా మార్పులకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానమివ్వడం ద్వారా భావోద్వేగ వ్యసనాన్ని నిర్ధారించడంలో వారు మీకు సహాయపడే అవకాశం ఉంది. భావోద్వేగంతో ఇబ్బంది పడే వారికి మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా చాలా అవసరం. అందువల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. చక్కెర, గ్లూటెన్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు మాత్రం దూరంగా ఉండాలి. వీటి స్థానంలో మాంసం, కూరగాయలు, పండ్లు, నెయ్యి, గింజలు, గుడ్లు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.

మిమ్మల్ని మీరు తక్కువగా భావించినప్పుడు జర్నలింగ్, ధ్యానం బాగా ఉపయోగపడతాయి. ఇది మీ భావోద్వేగాలకు కారణమయ్యే వాటిని గుర్తించడంలో సంభవించే ఏవైనా నమూనాలను గుర్తించడంలో మీకు సహాయపడుతుంది. ఇది చివరికి వైద్య ప్రక్రియను ప్రారంభిస్తుంది. మీరు అనుభవించే భావోద్వేగాలను అనుభవించడం చాలా మంచిది. వాటిని చూసి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాటికి బానిస కాకుండా మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకోవాలి. స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మానసిక ధైర్యాన్ని పొందవచ్చు. నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.