Health: నిద్రపోతున్నా మూత్రం వస్తున్న ఫీలింగ్ వేధిస్తోందా.. అలర్ట్ గా లేకపోతే పెను సమస్యలు తప్పవు

శరీరంలో పేరుకుపోయిన మలినాలు, వ్యర్థ పదార్థాలు విసర్జన ప్రక్రియ ద్వారా బయటకు వెళ్లిపోతాయన్న విషయం మనకు తెలిసిందే. ఈ ప్రక్రియలో మూత్రవ్యవస్థ (Urination)e చురుకుగా పని చేస్తుంది. మూత్రం రావడం అనేది సహజమైన...

Health: నిద్రపోతున్నా మూత్రం వస్తున్న ఫీలింగ్ వేధిస్తోందా.. అలర్ట్ గా లేకపోతే పెను సమస్యలు తప్పవు
Urinatiion Problems

Edited By:

Updated on: Aug 31, 2022 | 6:14 PM

శరీరంలో పేరుకుపోయిన మలినాలు, వ్యర్థ పదార్థాలు విసర్జన ప్రక్రియ ద్వారా బయటకు వెళ్లిపోతాయన్న విషయం మనకు తెలిసిందే. ఈ ప్రక్రియలో మూత్రవ్యవస్థ (Urination)e చురుకుగా పని చేస్తుంది. మూత్రం రావడం అనేది సహజమైన ప్రక్రియ. అయితే ఎక్కువ సార్లు మూత్రం వస్తుంటే మాత్రం అది సమస్యగా పరిగణించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆందోళన కలిగించే విషయమని, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలు, లవణాలు, ఎలక్ట్రోలైట్స్, యూరిక్ యాసిడ్ వంటివి మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. రాత్రి సమయం కంటే పగటి సమయంలో మూత్రానికి వెళ్లే పరిస్థితి వస్తుంది. రాత్రి వేళల్లో మనం నిద్రపోతాం. కాబట్టి బయటకు వెళ్లాల్సిన అవసరం అంతగా రాదు. అయితే కొంత మందికి మాత్రం రాత్రి వేళల్లోనూ మూత్రం వస్తుంది. ఈ సమస్య ఒకటి, రెండు సార్లు ఉంటే ప్రమాదమేమీ లేదని, అంతకు మించితే మాత్రం జాగ్రత్త వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రిపూట రెండుసార్లు కంటే ఎక్కువ మూత్ర విసర్జన చేసే వ్యక్తులు నోక్టురియా వ్యాధితో బాధపడుతున్నట్లుగా గుర్తించారు. మధుమేహ వ్యాధిగ్రస్తులను ఈ రకమైన సమస్య అధికంగా ఇబ్బంది కలిగిస్తుంది. శరీరంలో షుగర్ లెవెల్స్ అదుపు తప్పితే అతిగా మూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

కిడ్నీలో ఇన్ఫెక్షన్ ఉంటే ఎక్కువగా మూత్రం వచ్చే సమస్య రావచ్చు. న్యూరోలాజికల్ డిజార్డర్ ఉన్నా ఎక్కువగా మూత్రం వచ్చే సమస్య ఉంటుంది. ఈ ఆరోగ్య సమస్య ఒక వయస్సులో సంభవించవచ్చు. దీనికి చికిత్స చేయడం చాలా ముఖ్యం. అంతే కాకుండా ఆందోళన, కాళ్లలో వాపు, అవయవ వైఫల్యం, మూత్రానికి సమీపంలో ఉన్న ప్రాంతంలో ఇన్ఫెక్షన్ వంటివి నోక్టురియా సంభవించడానికి కారణాలు కావచ్చు. అందుకే రాత్రి సమయంలో ఎక్కువ సార్లు మూత్రం వచ్చినట్లు అనిపిస్తే ఆలస్యం చేయకుండా నిపుణులను సంప్రదించాలి. ఏదైనా సమస్య తక్కువగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి