AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మధుమేహ బాధితులకు దానిమ్మ పండు అద్భుత వరం.. ఎన్నో పోషకాలు.. మరెన్నో ప్రయోజనాలు

అన్ని పండ్లలోకెల్లా దానిమ్మ (Pomegranate) ప్రత్యేకమైనది. ఎర్రటి గింజలతో నిగనిగలాడుతూ..చూస్తేనే నోరూరిపోయే ఈ పండును చిన్నా పెద్దా అనే లేకుండా అందరూ ఇష్టపడుతుంటారు. సీజన్లతో సంబంధం లేకుండా..

Health: మధుమేహ బాధితులకు దానిమ్మ పండు అద్భుత వరం.. ఎన్నో పోషకాలు.. మరెన్నో ప్రయోజనాలు
Pomegranate Health Tips
Ganesh Mudavath
|

Updated on: Oct 24, 2022 | 3:22 PM

Share

అన్ని పండ్లలోకెల్లా దానిమ్మ (Pomegranate) ప్రత్యేకమైనది. ఎర్రటి గింజలతో నిగనిగలాడుతూ..చూస్తేనే నోరూరిపోయే ఈ పండును చిన్నా పెద్దా అనే లేకుండా అందరూ ఇష్టపడుతుంటారు. సీజన్లతో సంబంధం లేకుండా అన్ని కాలాల్లో అందుబాటులో ఉండే దానిమ్మతో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండులో ఎన్నో రకాల పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు అధిక సంఖ్యలో ఉంటాయి. ఇది శరీరాన్ని అన్ని రకాల అనారోగ్యాల నుంచి కాపాడుతుంది. గుండె, మెదడు (Heart Health)-ఆరోగ్యానికి చక్కగా పని చేస్తుంది. విటమిన్ ఏ, విటమిన్ – సీ అధిక మొత్తంలో ఉంటుంది. ఆకలి కలిగించే భావనను పెంపొందించడం వల్ల బరువు పెరగకుండా చూసుకుంటుంది. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు స్థాయిలు ఎంత వరకు ఉన్నాయంటే.. గ్రీన్ టీ లేదా రెడ్ వైన్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా. అంతే కాకుండా ఇందులోని లిపోప్రొటీన్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. దానిమ్మపండులో 83 కిలో కేలరీలు, 13 గ్రాముల చక్కెర ఉంటుంది, ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) 53 గా ఉంటుంది. ఇందులో ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె పుష్కలంగా ఉుంటుంది. ఇందులోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటు (బీపీ)ని తగ్గించడంలో సహాయపడుతుంది.

టైప్ – 2 డయాబెటిస్ నివారణ, చికిత్సకు దానిమ్మ అద్భుతంగా పని చేస్తుందని వివిధ అధ్యయనాలు వెల్లడించాయి. దానిమ్మలోని ఎల్లాజిక్, గాలిక్, ఒలియానోలిక్, ఉర్సోలిక్, ఆలిక్ యాసిడ్స్, టానిన్‌లు మధుమేహాన్ని నియంత్రించేందుకు చక్కగా పని చేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. మధుమేహం ఉన్నవారిలో జరిపిన ఒక అధ్యయనంలో రోజూ దానిమ్మ రసం తీసుకోవడం వల్ల ఇన్‌ఫ్లమేటరీ మార్కర్‌లను 30 శాతం తగ్గించినట్లు తేలింది. భారతీయులు తమ ఆహార అలవాట్లలో పండ్లను అధికంగా వినియోగిస్తూ ఉంటారు. దానిమ్మపండ్లను సలాడ్ రూపంలో, జ్యూస్ ల రూపంలో తీసుకుంటారు. స్మూతీలు, స్నాక్స్ గా తీసుకుంటారు.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించేముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం..  క్లిక్ చేయండి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?