Water Health: తాగునీటిలో పరిమితికి మించి ఫ్లోరైడ్.. ఆ ప్రాంతాల్లో మరీ అత్యధికం.. నిపుణులు ఏమంటున్నారంటే..

|

Jan 17, 2023 | 6:54 AM

మానవ మనుగడకు నీరు అత్యంత ఆవశ్యకమైంది. నీరు లేకుంటే జీవం లేదు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అన్ని పనులు నీటితోనే. అంతే కాకుండా మన శరీరంలోనూ నీటి పర్సంటేజ్ ఎక్కువే....

Water Health: తాగునీటిలో పరిమితికి మించి ఫ్లోరైడ్.. ఆ ప్రాంతాల్లో మరీ అత్యధికం.. నిపుణులు ఏమంటున్నారంటే..
Water
Follow us on

మానవ మనుగడకు నీరు అత్యంత ఆవశ్యకమైంది. నీరు లేకుంటే జీవం లేదు. ఉదయం నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు అన్ని పనులు నీటితోనే. అంతే కాకుండా మన శరీరంలోనూ నీటి పర్సంటేజ్ ఎక్కువే. నీటిలో చాలా మూలకాలు ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో లభించే భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ పరిమితికి మించి అధికంగా ఉంటోంది. దీంతో ఆ నీటిని తాగిన ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధితో అవస్థలు పడుతున్నారు. ఆగ్రాలో ఫ్లోరైడ్ అధికంగా ఉండే నీటిని తాగిన తర్వాత చాలా మంది అనారోగ్యానికి గురయ్యారు. దేశంలోని అనేక ఇతర ప్రాంతాల నీటిలో కూడా ఫ్లోరైడ్ పరిమాణం చాలా ఎక్కువగా ఉంది. అయితే వాటి గురించి ప్రజలకు ఎలాంటి సమాచారం లేకపోవడం శోచనీయం. నీటిలో ఫ్లోరైడ్ పరిమాణాన్ని కొలిచేందుకు అనేక పరీక్షలు జరిగాయి. అయినా కొన్ని ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటిని అందించలేకపోతున్నారు. ఫలితంగా అదే నీటిని తాగి జీవచ్ఛవంలా మారుతున్నారు అమాయకులు.

ఫ్లోరైడ్ అధికంగా ఉండే నీటిని తాగడం వల్ల మలబద్ధకం, దాహం తీరకపోవడం, కడుపులో గ్యాస్ సమస్యలు వస్తాయి. ఈ సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నట్లయితే నీటిలో ఫ్లోరైడ్ పరిమాణం చాలా ఎక్కువగా ఉందని అర్థం. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు ఫ్లోరోసిస్‌ బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. చాలా గ్రామాల్లో చేతిపంపులు, బావుల నీటిని తాగుతున్నారు. ఈ నీరు ఫిల్టర్ అవదు. అయితే పట్టణ ప్రాంతాల్లోని ప్రజల ఇళ్లలో ఏర్పాటు చేసుకున్న వాటర్ ప్యూరిఫయర్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందుతోంది.

ఫ్లోరోసిస్ వ్యాధికి గురయిన వారు సాధారణంగా తాము ఆర్థరైటిస్ సమస్యతో భావిస్తుంటారు. కానీ ఆలస్యం అయ్యేకొద్దీ అమృతం విషంగా మారుతుందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి కారణం లేకుండా దంతాలు పసుపు రంగులోకి మారితే ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చిందనే విషయాన్ని గ్రహించాలి. ఎముకలలో నొప్పి ఉంటే, అప్పుడు వైద్యుడిని సంప్రదించాలి. ఫ్లోరోసిస్ పరీక్ష చేయించుకోవాలి. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉసిరి, నారింజ, ద్రాక్ష వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి.

ఇవి కూడా చదవండి

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం