Air pollution: శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే అది న్యుమోనియా కావొచ్చు..

దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక సమీప రాష్ట్రాల్లో వాయు కాలుష్యం స్థాయి గణనీయంగా పెరిగింది. కలుషిత గాలి పీల్చడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల్లోని ఓపీడీల్లో శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య 30 శాతం పెరిగింది...

Air pollution: శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే అది న్యుమోనియా కావొచ్చు..
Air Pollution
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Nov 11, 2021 | 7:35 PM

దేశ రాజధాని ఢిల్లీ సహా అనేక సమీప రాష్ట్రాల్లో వాయు కాలుష్యం స్థాయి గణనీయంగా పెరిగింది. కలుషిత గాలి పీల్చడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆస్పత్రుల్లోని ఓపీడీల్లో శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వారి సంఖ్య 30 శాతం పెరిగింది. నిరంతర దగ్గు, ఊపిరి ఆడకపోవడం, అలాగే న్యుమోనియాతో ప్రజలు బాధపడుతున్నారు. గత రెండు వారాలుగా ఆసుపత్రిలో శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరుగుతోందని గురుగ్రామ్‌లోని మ్యాక్స్ హాస్పిటల్ మెడిసిన్ విభాగం సీనియర్ డైరెక్టర్ డాక్టర్ అశుతోష్ శుక్లా చెప్పారు. పరీక్షల్లో కొంతమంది రోగుల్లో న్యుమోనియా గుర్తించామన్నారు. ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ న్యుమోనియా వస్తుందని తెలిపారు. దీని ప్రారంభ లక్షణం శ్వాసలోపంతో కూడిన దగ్గు. రోజురోజుకు దగ్గు పెరుగుతూ దానితో పాటు తెమడ కూడా వస్తుంటే వైద్యుల సలహా తీసుకోవాలి. ఎందుకంటే న్యుమోనియా త్వరగా గుర్తించకపోతే అది రోగికి ప్రాణాంతకం కావచ్చు.

20% మంది రోగులలో న్యుమోనియా లక్షణాలు ఆస్పత్రికి వస్తున్న 20 శాతం మందికి న్యుమోనియా లక్షణాలు కనిపిస్తున్నాయని ఢిల్లీలోని జిటిబి ఆసుపత్రి పల్మోనాలజిస్ట్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ఈ రోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆస్తమాతో బాధపడుతున్నవారు ఎల్లప్పుడూ ఇన్‌హేలర్‌ను తమతో ఉంచుకోవాలన్నారు. అనవసరంగా ఇంటి నుండి బయటకు రాకుండా ఉండాలని సూచించారు. ఈ సీజన్‌లో ప్రతి సంవత్సరం శ్వాసకోశ వ్యాధుల రోగులు పెరుగుతారని ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్‌లోని పల్మోనాలజిస్ట్ డాక్టర్ అవి కుమార్ చెప్పారు. ఈసారి కూడా కేసులు వేగంగా పెరుగుతున్నాయని. సిఓపిడి, బ్రాంకైటిస్ సమస్య ప్రజలలో కనిపిస్తుందన్నారు. పెరుగుతున్న కాలుష్యం రక్షణ పొందాలంటే N-95 మాస్క్‌లు ధరించడం అవసరం చెప్పారు. సాయంత్రం వాకింగ్‌కు వెళ్లవద్దన్నారు.

న్యుమోనియా వచ్చినా, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్‌లు వచ్చినా, ఫ్లూ వ్యాక్సిన్‌ను తప్పకుండా వేయించుకోవాలని వైద్యుడు అశుతోష్‌ చెబుతున్నారు. ఈ టీకా శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుందని చెప్పారు. ఇది కూడా ఈ సమస్యలను అదుపులో ఉంచుతుందన్నారు. అన్ని ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందని పేర్కొన్నారు.

Read Also.. Dates for Diabetes: షుగర్ పేషేంట్స్‌కు తీపి తినాలని ఉంటే.. వీటిని రోజు తినే ఆహారంలో మితంగా తీసుకోవచ్చంటున్న నిపుణులు..