Dates for Diabetes: షుగర్ పేషేంట్స్‌కు తీపి తినాలని ఉంటే.. వీటిని రోజు తినే ఆహారంలో మితంగా తీసుకోవచ్చంటున్న నిపుణులు..

Dates for Diabetes: ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో రోజు రోజుకీ మనుషుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన,  స్పృహ పెరుగుతుంది. దీంతో తినే ఆహారాన్ని ఎంపిక చేసుకుంటున్నారు..

Dates for Diabetes: షుగర్ పేషేంట్స్‌కు తీపి తినాలని ఉంటే.. వీటిని రోజు తినే ఆహారంలో మితంగా తీసుకోవచ్చంటున్న నిపుణులు..
Dates For Diabetes
Follow us
Surya Kala

|

Updated on: Nov 11, 2021 | 6:56 PM

Dates for Diabetes: ప్రస్తుతం ఉన్న పరిస్థితులతో రోజు రోజుకీ మనుషుల్లో ఆరోగ్యం పట్ల అవగాహన,  స్పృహ పెరుగుతుంది. దీంతో తినే ఆహారాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. అటువంటి ఆహారాల్లో ఒకటి ఖర్జూరం ఒకటి. డయాబెటిస్‌తో బాధపడుతున్న వ్యక్తులకు సురక్షితమైన ఎంపిక ఖర్జూరం. అయితే అయితే ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిదేనా? డయాబెటిస్ ఉన్నవారు రోజూ ఎన్ని ఖర్జూరాలు తినవచ్చు? ఈరోజు తెలుసుకుందాం..

ఖర్జూరాలు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది తినే ఆహారంలో ఒకటి. ఇవి సహజమైన తీపి కలిగి ఉంటుంది. ఖర్జురాల్లో  ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజాలు నిండి ఉన్నాయి. దాదాపు 100 గ్రాముల ఖర్జూరంలో దాదాపు 314 కేలరీలు ఉంటాయి. ముఖ్యంగా ఖర్జూరంలో అధిక కేలరీలు కలిగి ఉంటాయి.  ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజుకి 2-3 ఖర్జూరాలు తీసుకోవడం వల్ల మధుమేహం ఉన్నవారు సురక్షితంగా ఉంటారు. అయితే ఆహారంలో ఖర్జురాలను తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది.

ఖర్జూరాలను మితంగా తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనేక విధాలుగా సహాయపడతాయి. ఎందుకంటే ఖర్జూరాల్లో ఫైబర్స్, యాంటీఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం , పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి.  ఖర్జూరంలో తక్కువ గ్లైసెమిక్ ఉండటంతో మంచి పోషకాహారమని అంటున్నారు. దీనిలో ఉన్న ఫైబర్  రక్తంలో చక్కెర నెమ్మదిగా శోషించబడటంలో సహాయపడుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది.

అంతేకాదు ఖర్జురాలను ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలతో కలిపి తీసుకున్నప్పుడు ఆకలి వేయకుండా నిరోధిస్తుంది.  అంతే కాకుండా ఖర్జూరంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించి ఊబకాయం వచ్చే ప్రమాదాన్ని నివారిస్తాయి. ఖర్జూరాలలో ఉండే ఫైటోఈస్ట్రోజెన్‌లు ఈస్ట్రోజెన్ హార్మోన్ల వంటి శరీరంపై ఒకే విధమైన ప్రభావాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని ముఖ్యమైన అవయవాల పనితీరులో సహాయపడతాయి.

అయితే ఖర్జురాలు మధుమేహ వ్యాధి గ్రస్తులపై ఎలా పనిచేస్తుంది అనేది ఇంకా చాలా పరిశోధనలు చేయాల్సిన  అవసరం ఉందని తెలిపారు. అయినప్పటికీ చక్కర వంటి తీపి పదార్ధాల కంటే మధుమేహం, ప్రీ-డయాబెటిస్‌తో బాధపడేవారికి ఖర్జూరం సురక్షితంగా పరిగణించబడుతుంది . అయినప్పటికీ.. ఖర్జూరాలను మితంగా తీసుకోవాలని,  ఆరోగ్య పరిస్థితిని బట్టి  రోజుకు 1-2 ఖర్జూరాలను మాత్రమే తీసుకోవాలని చెప్పారు.

Also Read:   ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. మరో 24 గంటల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం..