AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Tea Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతున్నారా.? సమస్యలో పడ్డట్టే.!

గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండటమే కాదు.. పోషక విలువలు కూడా ఎక్కువే.

Green Tea Benefits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతున్నారా.? సమస్యలో పడ్డట్టే.!
Green Tea Benefits
Ravi Kiran
|

Updated on: Oct 01, 2022 | 1:16 PM

Share

ఈ మధ్యకాలంలో యువత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. బరువు తగ్గేందుకు, అదుపులో ఉంచుకునేందుకు పలు పోషకాహారాలను తీసుకుంటున్నారు. ఆ కోవలోనే కొందరు బరువును నియంత్రించేందుకు కొందరు గ్రీన్ టీ తాగుతున్నారు. గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండటమే కాదు.. పోషక విలువలు కూడా ఎక్కువే. సహజసిద్దమైన గ్రీన్ టీ.. రోగ నిరోధకశక్తిని పెంచడమే కాదు.. మెటబాలిజం పెరగడంలో సహాయపడుతుంది. అటు మెదడు కూడా చురుగ్గా పని చేయడంలో సహాయపడుతుంది. మరి ఇంతటి పోషకాల నిధిని ఎప్పుడెప్పుడు తాగాలన్న విషయం చాలామందికి తెలియదు. కొందరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతుంటే.. మరికొందరు భోజనం చేశాక.. ఇంకొందరు రాత్రి వేళల్లో గ్రీన్ టీ తాగుతుంటారు. మరి గ్రీన్ టీ ఎప్పుడు తాగితే ఆరోగ్యానికి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలామంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగుతుంటారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని.. దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు అంటున్నారు.

గ్రీన్ టీ తాగేందుకు సరైన సమయం ఏది..?

అసలు గ్రీన్ టీ తాగేందుకు సరైన సమయం ఏది.? ఎక్సర్‌సైజులు చేసిన తర్వాత.. ఉదయం 11-12 గంటల మధ్య తీసుకోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే మధ్యాహ్నం భోజనానికి ఒక గంట ముందు.. సాయంత్రం అల్పాహారం తీసుకున్న తర్వాత ఒక గంటకు.. అటు రాత్రి పదుకునే ముందు కూడా గ్రీన్ టీ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Follow Us
మరో 5 ఏళ్లు టీమిండియాను టచ్ చేయోద్దయ్యో.. మాడి మసైపోతారంతే
మరో 5 ఏళ్లు టీమిండియాను టచ్ చేయోద్దయ్యో.. మాడి మసైపోతారంతే
ముస్లిం యువకుడిని పెళ్లాడిన మోనాలిసా ఇస్లాం మతంలోకి మారనుందా?
ముస్లిం యువకుడిని పెళ్లాడిన మోనాలిసా ఇస్లాం మతంలోకి మారనుందా?
ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లకు TGRJC CET 2026 నోటిఫికేషన్ విడుదల
ఇంటర్ ఫస్ట్‌ ఇయర్‌ అడ్మిషన్లకు TGRJC CET 2026 నోటిఫికేషన్ విడుదల
అరటిపండు Vs ఖర్జూరం.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
అరటిపండు Vs ఖర్జూరం.. రెండిటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..?
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
పీఎం కిసాన్ విడుదల వేళ కేంద్రం అలర్ట్.. రైతుల ఫోన్లకు మెస్సేజ్
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
JEE Main 2026 దరఖాస్తుకు మళ్లీ తెరచుకున్న అప్లికేషన్లు..లింక్ ఇదే
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
కుప్పకూలుతున్న బంగారం, వెండి ధరలు.. మహిళలకు పండగే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
అమెరికాకు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ వార్నింగ్.. యుద్ధం ఆపాలంటే..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వావ్.. వారికి ఆదాయం పెరిగే ఛాన్స్..
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!