Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cold Water Effects: శీతాకాలంలోనూ చన్నీళ్లు తాగుతున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు..!

చాలా మందికి కాలంలో పనిలేకుండా ఇష్టనుసారం వేడినీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అలాగే చల్లటి నీరు తాగే అలవాటు ఉన్నవారు కూడా అందుకు..

Cold Water Effects: శీతాకాలంలోనూ చన్నీళ్లు తాగుతున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు..!
Cold Water
Follow us
శివలీల గోపి తుల్వా

| Edited By: Anil kumar poka

Updated on: Feb 05, 2023 | 10:00 AM

చాలా మందికి కాలంలో పనిలేకుండా ఇష్టనుసారం వేడినీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అలాగే చల్లటి నీరు తాగే అలవాటు ఉన్నవారు కూడా అందుకు ఇష్టపడతారు. అయితే చలికాలంలో చల్లటి నీరు తాగడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. చలికాలంలో చల్లటి నీరు మీ శరీరానికి ఎలాంటి హాని చేస్తుందో మీకు తెలిస్తే.. మీరు తక్షణమే గోరువెచ్చని నీటిని తాగడం ప్రారంభిస్తారు. చల్లని నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు, దంత సమస్యలు తలెత్తుతాయి. చలికాలంలో చల్లటి నీరు తాగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. అన్నింటిలో మొదటిది ఏమిటంటే చన్నీరు తాగిన మరుసటి రోజు మీ ముక్కు మూసుకుపోతుంది. అంతే కాకుండా జలుబు సమస్య వల్ల ఛాతీలో కఫం, తలనొప్పి వంటి సమస్యలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా చలికాలంలో చల్లటి నీరు తాగడం మానుకోవాలని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.

చల్లటి నీరు మీ గొంతును ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. మీరు గొంతు నొప్పి, వాయిస్ కోల్పోవడం వంటి సంబంధిత సమస్యలతో బాధపడవచ్చు. ఇంకా గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది హృదయ స్పందన రేటును మరింతగా పెంచుతుంది. చల్లటి నీరు జీర్ణక్రియనూ ప్రభావితం చేస్తుంది. అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలను మీకు కలిగుతాయి.

ఛాతీలో శ్లేష్మం, తలనొప్పి వంటి సమస్యలు: చలికాలంలో చన్నీటిని తాగడం వల్ల మీకు జలుబు చేస్తుంది. అంతే కాక దాని వల్ల మీ దంతాలను దెబ్బతింటాయి. దంతాలు జలదరించే సమస్యలు రావచ్చు. ఇంకా చల్లని నీరు మీ దంతాలలోని నరాలను బలహీనపరుస్తుంది. అదనంగా, మీ కడుపుకు హాని కలిగిస్తుంది. ఇది జీర్ణక్రియలో కూడా సమస్యలను కలిగిస్తుంది. దీనితో పాటు వికారం, కడుపు నొప్పి కలగవచ్చు. అందుకే చలికాలంలో గోరువెచ్చని నీటిని మాత్రమే తాగండి. కేవలం రుచి కోసమో, అలవాటు కోసమో చల్లటి నీరు తాగకండి. ఇది మీ శరీరంలో అనేక విధాలుగా హానికరమని తెలుసుకోండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

శాంసంగ్‌ కంపెనీతో ఆపిల్‌ డీల్‌.. ఇది నిజమేనా? అదేంటో తెలుసా..?
శాంసంగ్‌ కంపెనీతో ఆపిల్‌ డీల్‌.. ఇది నిజమేనా? అదేంటో తెలుసా..?
ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ రామనవమి విషెస్..!
ఫ్రెండ్స్, ఫ్యామిలీ కోసం టాప్ ట్రెండింగ్ రామనవమి విషెస్..!
రూ. 3 కోట్లు కట్టాలంటూ రైతు బిడ్డకు ఐటీ నోటీస్!
రూ. 3 కోట్లు కట్టాలంటూ రైతు బిడ్డకు ఐటీ నోటీస్!
ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు నయా బాస్! ఈ సారి మనోడు కాదు భయ్యో!
ఆసియా క్రికెట్ కౌన్సిల్ కు నయా బాస్! ఈ సారి మనోడు కాదు భయ్యో!
ఇంటర్‌ సెకండియర్ తరగతులు ప్రారంభం.. వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే?
ఇంటర్‌ సెకండియర్ తరగతులు ప్రారంభం.. వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే?
ఇటుకలతో రాజమంచం..లక్షలు పెట్టినా ఇలాంటిది దొరకదేమో!
ఇటుకలతో రాజమంచం..లక్షలు పెట్టినా ఇలాంటిది దొరకదేమో!
Video: ఉదయం నిద్ర లేవగానే ఇంటిలో దూరిన చిరుత పులి...
Video: ఉదయం నిద్ర లేవగానే ఇంటిలో దూరిన చిరుత పులి...
ఆహా.. ఎంత చల్లని కబురో.. వచ్చే మూడు రోజులు వానలే వానలు..
ఆహా.. ఎంత చల్లని కబురో.. వచ్చే మూడు రోజులు వానలే వానలు..
వీటినిఅప్పుగా ఇచ్చినా తీసుకున్నా కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే..
వీటినిఅప్పుగా ఇచ్చినా తీసుకున్నా కష్టాలు కోరి తెచ్చుకున్నట్లే..
MBBS పరీక్ష కోసం 'మిస్ ఇండియా' వద్దనుకున్న తెలుగు హీరోయిన్
MBBS పరీక్ష కోసం 'మిస్ ఇండియా' వద్దనుకున్న తెలుగు హీరోయిన్