Dandruff Tips: తలలో చుండ్రుకు ప్రధాన కారణాలివే.. వీటిని నిరోధిస్తే మీ ప్రోబ్లెమ్ సాల్వ్ అయినట్లే..!

సీజనల్ వ్యాధులతో బాధపడే ఈ చలికాలంలో చుండ్రు సమస్య అనేది సర్వసాధారణం. ఫలితంగా తరచుగా తల నుంచి చుండ్రు రాలడం..

Dandruff Tips: తలలో చుండ్రుకు ప్రధాన కారణాలివే.. వీటిని నిరోధిస్తే మీ ప్రోబ్లెమ్ సాల్వ్ అయినట్లే..!
Dandruff Tips
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Feb 05, 2023 | 8:57 AM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యసమస్యలతో సతమతమవుతున్నారు. వీటికి వారు పాటిస్తున్న ఆహార నియమాలు, జీవన విధానం ప్రధాన కారణాలు. ఈ రెండు కారణాలతోనే మన చర్మ, కేశ సంరక్షణ క్లిష్టతరంగా మారింది. చర్మ, కేశ సమస్యలను నివారించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితాలు ఉండబోవడంలేదు. అయితే సీజనల్ వ్యాధులతో బాధపడే ఈ చలికాలంలో చుండ్రు సమస్య అనేది సర్వసాధారణం. ఫలితంగా తరచుగా తల నుంచి చుండ్రు రాలడం మొదలవుతుంది. ఈ కారణంగా చాలా ఇబ్బంది పడవలసి ఉంటుంది. నలుగురిలోకి వెళ్ళడానికి కూడా కొంతమంది ఆసక్తి చూపరు. అందుకే చుండ్రును వదిలించుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని రకాల ఇంటి చిట్కాలను పాటిస్తే చాలంటున్నారు సౌందర్య నిపుణులు. మరి వారి ప్రకారం ఏయే చిట్కాలను పాటించాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

  1. పని తర్వాత జుట్టు కడగడం: మీరు రోజువారీ వ్యాయామం లేదా శారీరక శ్రమ చేస్తే జుట్టులో చెమట వస్తుంది. ఈ సందర్భంలో జుట్టును వెంటనే శుభ్రమైన నీటితో కడగాలి. లేకపోతే ఈ చెమట కారణంగా కూడా చుండ్రు సమస్య పెరిగే అవకాశం ఉంది.
  2. టోపీని ఎక్కువగా పెట్టుకోకూడదు: ఎండలో బయటకు వెళ్లినప్పుడు టోపీని ధరిస్తే చెమట ఎక్కువగా వస్తుంది. ఇది మీ జుట్టులో చుండ్రు సమస్యకు దారితీస్తుంది. ఇన్ని చేసినా చుండ్రు తగ్గకపోతే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించండి.
  3. జుట్టుని శుభ్రంగా ఉంచుకోవాలి: చుండ్రును వదిలించుకోవడానికి ముఖ్యంగా తలని శుభ్రంగా ఉంచుకోవాలి. దీని కోసం జుట్టును వారానికి 3, 4 సార్లు కడగాలి. ఆ క్రమంలో కావాలంటే 2 శాతం కెటోకానజోల్ లేదా జింక్ పైరిథియోన్ ఉండే షాంపూని ఉపయోగించవచ్చు.
  4. జుట్టుకు నూనె రాయకూడదు: తలలో చుండ్రు సమస్య ఉంటే హెయిర్ ఆయిల్‌ను అప్లై చేయడం మానుకోవాలి. జుట్టుకు నూనె రాయడం వల్ల చుండ్రు సమస్య మరింత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో నూనెకు దూరంగా ఉండాలి.
  5. ఇవి కూడా చదవండి
  6. మురికి దువ్వెన వద్దు: మీరు చుండ్రు సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఎవరైనా ఉపయోగించిన దువ్వెన వాడవద్దు. ఇది జుట్టులో చుండ్రును మరింత పెంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం.. క్లిక్ చేయండి..