Kidney Disease: ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు.! కిడ్నీ సమస్యకు సంకేతాలు కావొచ్చు

| Edited By: Ravi Kiran

Oct 10, 2024 | 3:40 PM

ప్రపంచవ్యాప్తంగా 84 కోట్ల మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. అంటే ప్రతి పదిమందిలో దాదాపు ఒకరికి కిడ్నీ వ్యాధి ఉంది. ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ ఇచ్చిన తాజా రిపోర్ట్ ఇది. ఈ మధ్యకాలంలో మరణాలకు కారణమవుతున్న..

Kidney Disease: ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం వద్దు.! కిడ్నీ సమస్యకు సంకేతాలు కావొచ్చు
Kidney
Follow us on

ప్రపంచవ్యాప్తంగా 84 కోట్ల మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. అంటే ప్రతి పదిమందిలో దాదాపు ఒకరికి కిడ్నీ వ్యాధి ఉంది. ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ ఇచ్చిన తాజా రిపోర్ట్ ఇది. ఈ మధ్యకాలంలో మరణాలకు కారణమవుతున్న అతి ప్రధానమైన జబ్బులలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఏడవ స్థానంలో ఉంది. ఒక్క ఇండియాలోనే ప్రతి సంవత్సరం రెండు లక్షల నుంచి 3 లక్షల మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్టు ఇండియన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ అధ్యయనంలో తెలిసింది.

దీనికి ప్రధాన కారణం కిడ్నీ సంబంధిత వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించకపోవడం అని, సమస్య ఎక్కువైన తర్వాత ఇది బయటపడుతోందని వైద్యులు అంటున్నారు. మన జీవన శైలి, తీసుకునే ఆహారం, అలవాట్లు, వంశపారంపర్య సమస్యలు, అనవసరమైన మెడిసిన్ తీసుకోవడం, ఇతర ఆరోగ్య సమస్యలు కిడ్నీల పనితీరుపై ప్రభావం చూపుతుంది. కిడ్నీ పనితీరు తగ్గిపోయి, శరీరంలోని వ్యర్ధాల తొలగింపు సరిగ్గా లేకపోవడంతో కొన్ని రకాల కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఏర్పడుతుంది.

కిడ్నీ సమస్యతో వచ్చే వ్యాధిలో దీర్ఘకాలిక ముత్ర పిండాల వ్యాధి ఒకటి.. ఈ వ్యాధికి గురైతే చాలా కాలం బాధపడాల్సి ఉంటుంది. మధుమేహం, హైబీపీ ఉన్నవారికి ఇది సాధారణంగా సోకుతుంది. ఆకలి లేకపోవడం, పాదాలు, చీలమండలం వద్ద వాపు, తక్కువగా శ్వాస తీసుకోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్కువగా లేదా తక్కువగా మూత్ర విసర్జన ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. కిడ్నీలో పేరుకుపోయే ఉప్పు లేదా ఇతర స్పటికాలను మూత్రపిండాల్లో రాళ్లుగా పిలుస్తారు. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మూత్రంలో రక్తం, రాయి ఉన్న భాగంలో నొప్పి, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే కిడ్నీలో రాళ్లు ఉన్నట్టుగా గమనించాలి. డయాబెటిస్ ఉన్న ప్రతి ముగ్గురిలో ఒకరికి కిడ్నీ వైఫల్యానికి దారితీస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆకలి లేకపోవడం, వాంతులు, బాగా నీరసంగా ఉండటం, శరీరం ఉబ్బడం, ఉబ్బసం, వెన్నునొప్పి, మూత్రంలో రక్తం, వెన్నునొప్పి, తల తిరగడం, మెడనొప్పి, వికారం, వాంతులు లాంటి లక్షణాలు గమనిస్తే కిడ్నీ సమస్య వస్తున్నట్లు అర్థం చేసుకోవాలి.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి