AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బ.. రెండే రెండు ఖర్జూరాలు.. వందలాది లాభాలు.. డైలీ ఉదయాన్నే తింటే..

అల్పాహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చుకోవడం చాలా మంచిది. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు.. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.. శరీరానికి కూడా చాలా పోషకాలు అందుతాయి.. అలాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో ఖర్జూరాలు ఒకటి.. అల్పాహారంలో ఖచ్చితంగా చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి..

అబ్బ.. రెండే రెండు ఖర్జూరాలు.. వందలాది లాభాలు.. డైలీ ఉదయాన్నే తింటే..
Dates Benefits
Shaik Madar Saheb
|

Updated on: Oct 10, 2024 | 3:27 PM

Share

అల్పాహారంలో ఆరోగ్యకరమైన పదార్థాలను చేర్చుకోవడం చాలా మంచిది. దీనివల్ల ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు.. అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.. శరీరానికి కూడా చాలా పోషకాలు అందుతాయి.. అలాంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో ఖర్జూరాలు ఒకటి.. అల్పాహారంలో ఖచ్చితంగా చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి.. ఉదయాన్నే కేవలం 2-3 ఖర్జూరాలను తినడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. ఇవి రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచవచ్చు. ఖర్జూరం తినడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. మీకు అవసరమైన పోషకాలు కూడా సులభంగా లభిస్తాయి. కేవలం 2-3 ఖర్జూరాలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయి.. రెగ్యులర్ గా తింటే శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకోండి..

ఖర్జూరాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  1. శరీరానికి శక్తినిస్తాయి: అల్పాహారంలో ఖర్జూరం తింటే శరీరానికి కావలసినంత శక్తి లభిస్తుంది. ఉపవాస సమయంలో ప్రజలు శక్తి కోసం ఖర్జూరాన్ని తింటారు. ఖర్జూరంలో చాలా ఫైబర్ ఉంటుంది. ఇది చాలా కాలం పాటు ఆకలిని దూరం చేస్తుంది. పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల, ఖర్జూరాలు మిమ్మల్ని రోజంతా చురుకుగా ఉంచుతాయి.
  2. మానసిక ఆరోగ్యం:  ఖర్జూరంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడును ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షించడంలో సహాయపడతాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం, బుద్ధిమాంద్యం, మానసిక సమస్యలు వంటి మెదడు సంబంధిత వ్యాధులను దూరంగా ఉంచుతుంది.
  3. మలబద్దకం దూరం: ఖర్జూరంలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనివల్ల ఆహారం సులభంగా పేగుల గుండా వెళుతుంది. ఖర్జూరం తినడం వల్ల మలబద్ధకం, కడుపు ఉబ్బరం కూడా తగ్గుతాయి. మీరు మలబద్ధకంతో బాధపడుతుంటే ఖచ్చితంగా ఖర్జూరాలను మీ ఆహారంలో చేర్చుకోండి. ఇది ప్రేగులకు సంబంధించిన అనేక వ్యాధులను కూడా నయం చేస్తుంది. అంతేకాకుండా పేగులను ఆరోగ్యంగా ఉంచుతాయి.
  4. చర్మానికి మేలు: ఖర్జూరం తినడం వల్ల చర్మానికి చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.. ఖర్జూరంలో యాంటీ-ఆక్సిడెంట్లు, ఫైటోహార్మోన్లు ఉంటాయి. ఇవి వృద్ధాప్య సమస్యను తగ్గిస్తాయి. చర్మం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండాలంటే రోజూ ఖర్జూరం తినండి.. ఖర్జూరం చర్మాన్ని ఆక్సిడేటివ్ డ్యామేజ్ నుండి రక్షించడానికి పని చేస్తుంది. అంతేకాకుండా నిగారింపును పెంచుతాయి..
  5. రక్తహీనత దూరం: ఖర్జూరం ఐరన్ కు మంచి మూలంగా పరిగణిస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రక్తహీనతను దూరం చేసుకోవచ్చు. రోజూ 2 ఖర్జూరాలు తింటే హిమోగ్లోబిన్ మెరుగుపడుతుంది. మహిళలు ముఖ్యంగా ఖర్జూరాన్ని తమ ఆహారంలో భాగం చేసుకోవాలి.

(గమనిక: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే.. ఏదైనా నివారణను స్వీకరించే ముందు వైద్యుడిని సంప్రదించండి)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..