AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: రాత్రి భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతారా..? ఆరోగ్యం పాడవుతుందా..?

రాత్రి భోజనం మానేయడం ఆరోగ్యానికి మంచిదా అనే సందేహం చాలా మందిని వేధిస్తోంది. కానీ రాత్రి భోజనం పూర్తిగా మానేయడం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందట. ఆకలితో నిద్రపోవడం వల్ల నిద్రలో అంతరాయం, గ్లూకోజ్ స్థాయిల మార్పులు, హార్మోన్ అసమతులతలు, జీర్ణ సమస్యలు కలగవచ్చు. బరువు తగ్గడంలో సహాయపడటానికి తేలికపాటి, పోషకాహారంతో నిండిన ఆహారాలు తీసుకోవడం మంచిది.

Health Tips: రాత్రి భోజనం మానేయడం వల్ల బరువు తగ్గుతారా..? ఆరోగ్యం పాడవుతుందా..?
Skipping Dinner
Prashanthi V
|

Updated on: Jan 20, 2025 | 8:31 PM

Share

ఉదయం అల్పాహారాన్ని మానుకోవడమా లేక తీసుకోవడమా అన్న చర్చ మనలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. అదే విధంగా రాత్రి భోజనం మానేయడం ఆరోగ్యానికి మంచిదా కాదా అనే ప్రశ్న కూడా చాలా మందికి సందేహంగా ఉంటుంది. దీనికి సరైన సమాధానం తెలుసుకోవడం ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంలో కీలకమైనది.

రాత్రి భోజనం మానేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని కొందరు నమ్ముతారు. అయితే ఇది నిజంగా బరువు తగ్గటానికి, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచటానికి ఎంత వరకు సహాయపడుతుంది అనే అంశాన్ని విశ్లేషించాల్సి ఉంది. అయితే రాత్రి భోజనం మానేయడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవచ్చు అంటున్నారు నిపుణులు.

రాత్రి భోజనం మానేయడం వల్ల ఏం జరుగుతుంది..?

  1. రాత్రి భోజనం మానేసి ఆకలితో పడుకుంటే నిద్ర సరిగా పట్టదు. ఇది మరుసటి రోజు శక్తి స్థాయిలను తగ్గిస్తుంది.
  2. గ్లూకోజ్ స్థాయిల్లో హెచ్చు తగ్గులు జరిగి మానసిక ఒత్తిడిని పెంచవచ్చు.
  3. శరీరంలో హార్మోన్‌ల అసమతులత ఏర్పడి అర్ధరాత్రి ఆకలి వేస్తుంది. దీని వల్ల మళ్లీ తినే పరిస్థితి వస్తుంది.
  4. తగిన ఆహారాన్ని తీసుకోకపోతే అసిడిటీ, అల్సర్ వంటి జీర్ణ సంబంధమైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
  5. సరైన ఆహారం లేకపోతే శరీర శక్తి తగ్గిపోయి, మరుసటి రోజు ఉదయం అలసటగా అనిపిస్తుంది.
  6. రాత్రి భోజనాన్ని మానేయకపోతే తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.

తేలికపాటి, పోషకాహారంతో నిండిన ఆహారం

  1. ఎక్కువ కూరగాయలతో తయారైన సూప్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
  2. మిక్స్‌డ్ వెజిటేబుల్ సాలడ్ లేదా పండ్లను ఆహారంలో చేర్చడం మంచిది.
  3. పుదీనా చట్నీతో తేలికపాటి డోక్లా తినవచ్చు.
  4. పాలతో కలిపిన ధాన్య కంజి తాగడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది.
  5. బ్రెడ్ టోస్ట్ లేదా ఆమ్లెట్ తినడం కూడా మంచి ఎంపిక.
  6. పప్పు రసం, తేలికపాటి అన్నం తీసుకోండి.

రాత్రి భోజనం పరిమాణాన్ని తగ్గించడం చాలా అవసరం. ఎందుకంటే రాత్రి భోజనం జీర్ణం చేసుకోవడానికి తక్కువ సమయం ఉంటుంది. అధిక కొవ్వు, అధిక చక్కెర లేదా అధిక ఉప్పు కలిగిన ఆహారాలను తినకూడదు. రాత్రి భోజనం నిద్రకు కనీసం రెండు గంటల ముందు పూర్తి చేయడం మంచిది. అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనానికి సమయం కేటాయించలేని వారు, రాత్రి భోజనాన్ని సమతులంగా చేయడం తప్పనిసరి. రాత్రి భోజనాన్ని పూర్తిగా మానేయడం కాకుండా తగిన పద్ధతిలో, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మీ శరీరానికి శక్తిని అందించవచ్చు. ఈ సింపుల్ మార్పులు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)