Corona Virus: కరోనా పాజిటివ్ వస్తే ఏ మందులు వాడాలో తెలుసా… ? నిపుణుల సూచనలు..

|

Apr 25, 2021 | 7:45 AM

Corona Virus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజూకీ తీవ్ర రూపం దాల్చుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారి

Corona Virus: కరోనా పాజిటివ్ వస్తే ఏ మందులు వాడాలో తెలుసా... ? నిపుణుల సూచనలు..
Corona Medicine
Follow us on

Corona Virus: దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజూకీ తీవ్ర రూపం దాల్చుతుంది. ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంతమంది మృత్యువుతో పొరాడుతున్నారు. ఇక కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నవారు డాక్టర్ల సలహాతో ఇంట్లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. మరీ అలాంటి వారు ఎలాంటి మందులు వేసుకోవాలో తెలుసా.. డాక్టర్స్ ఇస్తున్న సలహాలు ఏమిటో తెలుసుకుందాం

ముందుగా కరోనా రోగులను మూడు వర్గాలుగా విభజిస్తాం. అవి మైల్డ్ మైల్డ్‌ (స్వల్పకాలిక), మోడరేట్‌ (మధ్యస్థ), సివియర్‌ (విషమం). అయితే వీరికి ఫలానా మందులంటూ బల్లగుద్దినట్లుగా ఉండవు. రోగిని బట్టి, అతని కండిషన్‌ను బట్టి మారుతుంటాయి. అయితే వైరస్‌ను చంపేవిగా అవి ఉంటాయి. మైల్డ్‌ కరోనాతో సాధారణ స్థితిలో ఉన్నవారిని హోం ఐసోలే షన్‌లో ఉంచి ఆన్‌లైన్‌ ద్వారా వైద్యం చేయొచ్చు. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు వారు ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ శాచురేషన్‌ స్థాయులు తెలుసుకోవాలి.ఇక కరోనా రోగులకు లక్షణాలను బట్టి మందులు ఉంటాయి. ముఖ్యంగా వారికి మల్టీ విటమిన్లు సరిపోతాయి. అలాగే వారికి రక్తపరీక్షలు చేయించి అవసరమైతే స్టెరాయిడ్స్ వాడాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇక ఆక్సిజన్ 90-94 ఉన్నవారు, సీటీ స్కాన్ స్కోరింగ్ 10-20 మధ్య ఉన్నవారు, నడిచిన ఆయాసం వచ్చేవారిని మోడరేట్‏గా చూస్తారు. అలాంటి వారిని తప్పకుండా ఆసుపత్రిలో చేర్పించాలి. వారికి ఆక్సిజన్ అవసరం ఉంటే వైద్యులు అందిస్తారు. వారికి ప్రధానంగా స్టెరాయిడ్స్‌తో పాటు రక్తాన్ని పలుచన చేసే మందులు ఇస్తారు. మరింత అవసరమైతే రెమ్ డెసివిర్ ఇస్తారు.

ఇక కరోనా రోగులలో పరిస్థితి విషమంగా ఉన్నవారికి వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తారు. అలాగే పైన చెప్పిన మూడు మందులతోపాటు ఇమ్యునో మాడ్యులేటర్స్ మందులను కూడా వాడాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేక కేసులలో తొసిలిజుమాబ్, ఇటోలిజుమాబ్ ఇవ్వాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే వారికి అవసరమైతే సైటో సార్బ్ డయాలసిస్ చేయాల్సి ఉంటుంది. వీటితోపాటు కాల్చిసిసిన్ ట్యాబ్లెట్స్ వేయాల్సి ఉంటుంది. రోగి పరిస్థితిని బట్టి వైద్యం, మందులు మారుతాయి.

Also Read: ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తితోపాటు శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుకోవచ్చు..

రాత్రిపూట పెరుగు తింటే మంచిదేనా ? నిపుణులు ఏం చెబుతున్నారంటే..