Health Tips: లవంగం మితంగా తింటే ఔషదం.. అతిగా తింటే అనారోగ్యం
లవంగం, ఇలాచి అదే యాలకులు అంటే తెలియని వారు ఉండరు. మంచి మాంసాహారం వండాలి అంటే ఈ మసాలా దినుసులు తప్పక ఉండాల్సిందే. కాస్త కారం ఉప్పు అటు ఇటు అయినా సరే గాని నాలుగు లవంగాలు కూరలో పడకుంటే పెదవి విరుస్తారు మాంసాహార ప్రియులు. టెస్ట్ కోసం లవంగాలు వాడటం బాగుంది కానీ ఇక్కడే భోజన ప్రియులు ఒక విషయం గమనించాలి. లవంగాలు అతిగా తింటే అనారోగ్యం తప్పదు అంటున్నారు వైద్యులు.

లవంగం, ఇలాచి అదే యాలకులు అంటే తెలియని వారు ఉండరు. మంచి మాంసాహారం వండాలి అంటే ఈ మసాలా దినుసులు తప్పక ఉండాల్సిందే. కాస్త కారం ఉప్పు అటు ఇటు అయినా సరే గాని నాలుగు లవంగాలు కూరలో పడకుంటే పెదవి విరుస్తారు మాంసాహార ప్రియులు. టెస్ట్ కోసం లవంగాలు వాడటం బాగుంది కానీ ఇక్కడే భోజన ప్రియులు ఒక విషయం గమనించాలి. లవంగాలు అతిగా తింటే అనారోగ్యం తప్పదు అంటున్నారు వైద్యులు. లవంగం వంటకాల్లో ఒక మంచి పేరున్న మసాలా దినుసు. ఇందులో లెక్కలేనన్ని ఔషధ గుణాలు ఉంటాయి. తాతల ముత్తాతల కాలం నుండి లవంగం అనేక ప్రయోజనాలు పొందుతున్నారు. కేవలం వంటల్లోనే కాదు ఆయుర్వేదం మందుల్లోను లవంగంను విరివిగా ఉపయోగిస్తారు. లవంగం చాలా హాట్ గా ఉంటుంది.
దీన్ని మాసాలా ఘాటు గట్టిగా అవసరం ఉండే బిర్యానీ మటన్, చికెన్ లాంటి పలు రకాల వంటకాల్లో ఎక్కువగా వాడుతారు. లవంగం అనేది వంటకాల రుచి పెంచడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. లవంగాలను మాసాల టీ చేయడంలో ఉపయోగిస్తారు. మసాలా టీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి కాపాడుతుంది. అయితే లవంగాల వల్ల మేలు ఎంత ఉందో కీడు కూడా అంతే ఉంది అంటున్నారు వైద్యులు. లవంగాల ఘాటు మెదడు పై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవంగాల్లో ఉండే యుజినల్ అనే రసాయనం అతిగా శరీరంలోకి వెళ్తే లేని పోనీ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. తలనొప్పి, కడుపు నొప్పి, రక్త స్రావం జరగడం లాంటి సమస్యలు వస్తాయి. ఇప్పటికే రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు మాత్రం లవంగాలకు దూరంగా ఉండటం మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..