Coriander Benefits: కొత్తిమీరను రోజూ వంటల్లో ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే!!

| Edited By: Ram Naramaneni

Sep 30, 2023 | 10:24 PM

భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో కొత్తి మీర కూడా ఒకటి. కొత్తి మీర లేకుండా నాన్ వెజ్ వంటలు, పచ్చళ్లు ఏవీ పూర్తి కావు. అంతేకాదు మరికొంత మంది రోజూ వంటల్లో కొత్తి మీరను విరివిగా ఉపయోగిస్తూంటారు. వంటకు అదనపు రుచిని ఇచ్చేది కొత్తి మీరే. కేవలం కొత్తిమీరే కాదు కొత్తిమీర గింజలు ధనియాలను కూడా మన వంట్లల్లో ఎక్కువగా ఉపయోగిస్తూంటాం. ధనియాలతో కూడా ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే వాతావరణ పరిస్థితులు..

Coriander Benefits: కొత్తిమీరను రోజూ వంటల్లో ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీకోసమే!!
Coriander Farming
Follow us on

భారతీయ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగించే వాటిల్లో కొత్తి మీర కూడా ఒకటి. కొత్తి మీర లేకుండా నాన్ వెజ్ వంటలు, పచ్చళ్లు ఏవీ పూర్తి కావు. అంతేకాదు మరికొంత మంది రోజూ వంటల్లో కొత్తి మీరను విరివిగా ఉపయోగిస్తూంటారు. వంటకు అదనపు రుచిని ఇచ్చేది కొత్తి మీరే. కేవలం కొత్తిమీరే కాదు కొత్తిమీర గింజలు ధనియాలను కూడా మన వంట్లల్లో ఎక్కువగా ఉపయోగిస్తూంటాం. ధనియాలతో కూడా ఎన్నో రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అయితే వాతావరణ పరిస్థితులు మారినప్పుడల్లా.. ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కొత్తి మీరతో కేవలం ఆరోగ్యమే కాకుండా.. అందాన్ని కూడా రెట్టింపు చేసుకోవచ్చు. కొత్తి మీర మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇంకా కొత్తి మీరతో ఎలాంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేస్తుంది:

కొత్తి మీరలో కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేసే గుణాలు మెండుగా ఉన్నాయి. మన ఆహారంలో కొత్తి మీరను చేర్చుకోవడం వల్ల.. కొలెస్ట్రాల్ ను అదుపు చేస్తుంది. బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల అనేక సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుంది. అదే రోజూ కొత్తి మీరను ఆహారంలో యాడ్ చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

జీర్ణ సమస్యలు తగ్గుతాయి:

కొత్తి మీరను ఉపయోగించుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దరి చేరవు. కొత్తి మీరలో ఉండే ఫైబర్ తిన్న ఆహారాన్ని త్వరగా అరిగేలా చేస్తుంది. దీంతో గ్యాస్, కడుపులో నొప్పి, ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు దరి చేరవు. మల బద్ధకం సమస్య కూడా తగ్గుతుంది.

హై బీపీని అదుపు చేస్తుంది:

హై బ్లడ్ ప్లెజర్ తో బాధ పడేవారు కొత్తి మీరను ఎక్కువగా తీసుకుంటే ఫలితం ఉంటుంది. కొత్తి మీరను సలాడ్స్ లో వాటిలో చేర్చి తీసుకోవడం వల్ల హైబీపీ అదుపులోకి వస్తుందని వైద్యులు కూడా సూచిస్తున్నారు. కొత్తి మీర హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్ వంటివి వచ్చే రిస్క్ ను తగ్గిస్తుంది.

కళ్లకు మంచిది:

కొత్తి మీరను తీసుకోవడం వల్ల కళ్లకు మంచి చేస్తుంది. కొత్తి మీరలో ఉండే విటమిన్ ఏ, సీ, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు.. కళ్ల మీద ఒత్తిడికి తగ్గిస్తాయి. అంతే కాకుండా వయసు పైబడే కొద్దీ వచ్చే ఐ సైట్ ను కూడా తగ్గిస్తుంది కొత్తి మీర.

నోటి దుర్వాసన ఉండదు:

కొత్తి మీరతో నోటి దుర్వాసన, నోటి పుళ్లని కూడా పొగొడుతుంది. పచ్చి కొత్తి మీరను కాస్త తీసుకుని నమిలితే ఈ సమస్యలు ఉండవు.

పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్స్:

కొత్తి మీరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇమ్యూనిటీ సిస్టమ్ ని బలంగా చేస్తాయి. క్రమం తప్పకుండా కొత్తి మీరను తీసుకుంటే అల్జీమర్స్, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తక్కువ అవుతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. వీటిని ఫాలో అయ్యే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించడం మేలు.