ఈ ఐదు రకాల చేదు పదార్థాలను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు.. అవెంటో మీరు తెలుసుకోండి..

|

Oct 27, 2021 | 11:46 AM

చేదు ఆహార పదార్థాలను తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు..కానీ శరీరానికి మేలు చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో

ఈ ఐదు రకాల చేదు పదార్థాలను తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు.. అవెంటో మీరు తెలుసుకోండి..
Bitter Taste Food
Follow us on

చేదు ఆహార పదార్థాలను తీసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు..కానీ శరీరానికి మేలు చేసి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో చేదు ఆహార పదార్థాలను ఎక్కువగా పనిచేస్తాయి. చేదు తినడం కష్టమే అయినా .. అనారోగ్య సమస్యలను తగ్గించడంలో చేదు రుచి కల్గిన ఆహార పదార్థాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా చేదు రుచి కల్గిన పదార్థాలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకు కాకర కాయ. ఇవి రుచికి చేదుగా ఉన్నా.. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అవెంటో తెలుసుకుందామా..

1. మెంతులు.. ఇవి రుచికి చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇందులో ఖనిజాలు.. విటమిన్లు.. కరిగే డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. మెంతులను తీసుకోవడం వలన మలబద్దకం సమస్య తగ్గుతుంది. అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రించడంలో కూడా ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా.. కొలెస్ట్రాల్ నియంత్రిచండంలోనూ ఇవి పనిచేస్తాయి.
2. కాకర కాయ.. ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికి తెలిసిన విషయమే. కాకర కాయ రసం కూడా శరీరానికి మంచిది. ఇందులో విటమిన్ ఎ, సి, పోటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాకర కాయ మధుమేహంను నియంత్రిచండంలో ఎక్కువగా సహాయపడుతుంది.
3. గ్రీన్ టీ… రుచికి చేదుగా ఉన్నప్పటికీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పాలతో స్వీట్ టీకి బదులుగా గ్రీన్ టీ తీసుకోవడం వలన బరువు తగ్గుతారు.. అంతేకాకుండా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో పాలీఫెనాల్స్.. యాంటీ క్యాన్సర్ కణాలతో పోరాడడంలో సహాయపడతాయి.
4. బచ్చలికూర, ఆకు కూరలు కాస్త చేదుగా లేదా ఆస్ట్రింజెంట్ రుచిని కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఐరన్, కాల్షియం, విటమిన్స్, ఇతర పోషకాలు శరీరానికి మంచివి. మిమ్మల్ని ఫిట్ గా ఉంచడంలో సహాయపడతాయి.
5. డార్క్ చాక్లెట్ తినడానికి కొందరు ఆసక్తి చూపించరు. డార్క్ చాక్లెట్ చేదుగా ఉంటుంది. ఇందులో కోకో పౌడర్ కలపడం వలన చేదుగా ఉంటుంది. కోకో మొక్క బీన్స్ నుండి తయారవుతుంది. ఇందులో జింక్, కాపర్, మెగ్నీషియం, ఐరన్, పాలిఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి రక్త నాళాలను వెడల్పు చేయడంతోపాటు మంట సమస్య నుంచి ఉపశమనం ఇస్తుంది.

Also Read: మద్యం తాగేటప్పుడు ఈ పదార్థాలను అస్సలు తినకూడదు… తింటే ఇక అంతే సంగతులు.. అవెంటంటే..

బొప్పాయి ఆకుల రసంతో డెంగ్యూ ఫీవర్‏కు చెక్ పెట్టొచ్చా ? .. అధ్యాయనాలు ఏం చెబుతున్నాయంటే..