Health Tips: ఈ 3 సమస్యలతో బాధపడుతున్నారా.. ఉప్పు, నిమ్మకాయ, మిరియాలతో ఇట్టే నయం చేసుకోండిలా..

|

May 31, 2022 | 8:30 AM

నిమ్మకాయ, ఉప్పు, మిరియాలు ప్రతి భారతీయ వంటగదిలో కనిపించే పదార్థాలు. ఈ మూడు పదార్థాల సహాయంతో మీరు ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు.

Health Tips: ఈ 3 సమస్యలతో బాధపడుతున్నారా.. ఉప్పు, నిమ్మకాయ, మిరియాలతో ఇట్టే నయం చేసుకోండిలా..
Lemon Salt Black Pepper
Follow us on

నిమ్మరసం, ఎండుమిర్చి, ఉప్పు స్వతహాగా మూలికా మందులుగా ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకు, మీకు గొంతునొప్పి ఉంటే, గోరువెచ్చని నీటిలో నిమ్మరసం(Lemon Juice) కలిపి పుక్కిలిస్తే, మీకు తక్షణ ఉపశమనం లభిస్తుంది. అదేవిధంగా గొంతునొప్పి ఉంటే గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి పుక్కిలిస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. చిన్న పిల్లలకు ఇలాంటి సమస్య వచ్చి పుక్కిలించలేకపోతే ఈ ఉప్పు కలిపిన నీటిని(Salt Water) నిదానంగా ఇచ్చి తాగిస్తే, ఉపశమనం కూడా లభిస్తుంది. ఇక నల్ల మిరియాల గురించి మాట్లాడితే, ప్రపంచంలోనే అత్యధికంగా వినియోగించే మసాలాగా పేరుగాంచింది. రుచితో పాటు ఆరోగ్యం కూడా ఇందులో ఉంది.

1. బరువు తగ్గించడంలో..

పెరుగుతున్న బరువును నియంత్రించుకోవాలనుకుంటే లేదా స్థూలకాయాన్ని తగ్గించుకోవాలనుకుంటే, మీరు ఇక్కడ పేర్కొన్న మిశ్రమాన్ని తీసుకోవాలి. ఒక గ్లాసు నీటిలో నాలుగో వంతు టీస్పూన్ ఎండుమిరియాల పొడి, రెండు టీస్పూన్ల నిమ్మరసం, ఒక టీస్పూన్ తేనె కలిపి రోజూ తాగాలి.

ఇవి కూడా చదవండి

2. వికారం, కడుపు నొప్పి, అజీర్ణం లేదా గ్యాస్ వంటి అనేక సమస్యలకు విరుగుడు..

వికారం, కడుపు నొప్పి, అజీర్ణం లేదా గ్యాస్ వంటి అనేక సమస్యల వల్ల వాంతులు అవుతున్నట్లు అనిపిస్తే, ఈ పరిస్థితిని నివారించడానికి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా నిమ్మరసం కలపండి. పావు చెంచా ఎండుమిర్చి కలుపుకుని తాగాలి.

3. జలుబు, ఫ్లూ ఉంటే..

జలుబు, ఫ్లూ వంటి లక్షణాలు కనిపించినప్పుడు, మీరు ఈ మూడు పదార్థాలను తీసుకోవడం ద్వారా మీ వ్యాధిని త్వరగా తగ్గించుకోవచ్చు. దీని కోసం, ఒక గ్లాసు వేడి నీటిలో సగం నిమ్మకాయను పిండాలి. దీనికి ఒక చెంచా నిమ్మ రసాన్ని కలపాలి. 10 నిముషాలు అలాగే ఉంచి తర్వాత తాగాలి. మీరు ఉపశమనం పొందే వరకు దీన్ని తాగాలి. మీరు రోజుకు రెండుసార్లు ఇలా తీసుకోవచ్చు. గొంతునొప్పి ఉన్నట్లయితే, ఒక చెంచా తేనెలో పావు టీస్పూన్ ఎండుమిర్చి పొడిని కలిపి, నిదానంగా తినాలి. మీరు తక్షణ ఉపశమనం పొందుతారు.

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు కేవలం సలహాలుగా మాత్రమే తీసుకోవాలి. ఇటువంటి చికిత్స/మందు/ఆహారం అనుసరించే ముందు, వైద్యుడిని సంప్రదించండి.