AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health News: స్నానం చేసే విసయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా.. ఒకరోజు మర్చినా.. ఇక అంతే..

వాతావరణం చల్లగా ఉంటే స్నానం చేయడానికి చాలా మంది బద్ధకిస్తూ ఉంటారు. ఇలా బద్ధకించేవారిలో యువత ఎక్కువుగా ఉంటారు. అసలు వాతావరణంతో సంబంధం లేకుండా స్నానం చేయాలని సూచిస్తున్నారు. రోజూ స్నానం చేయకపోతే చర్మ సంబంధ వ్యాధులు, సీజనల్ వ్యాధులు..

Health News: స్నానం చేసే విసయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారా.. ఒకరోజు మర్చినా.. ఇక అంతే..
Bathing
Amarnadh Daneti
|

Updated on: Dec 21, 2022 | 9:12 PM

Share

వాతావరణం చల్లగా ఉంటే స్నానం చేయడానికి చాలా మంది బద్ధకిస్తూ ఉంటారు. ఇలా బద్ధకించేవారిలో యువత ఎక్కువుగా ఉంటారు. అసలు వాతావరణంతో సంబంధం లేకుండా స్నానం చేయాలని సూచిస్తున్నారు. రోజూ స్నానం చేయకపోతే చర్మ సంబంధ వ్యాధులు, సీజనల్ వ్యాధులు త్వరగా వస్తాయని హెచ్చరిస్తున్నారు. వైద్య నిపుణులు. శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. పైగా బద్ధకంగా అనిపిస్తుంది. ఈ సమయంలో ఏపని చేయడానికైనా కాస్త బద్ధకించడం సాధారణం. బద్ధకం వల్ల స్నానం చేయాలని అనిపించదు. స్నానం చేయకపోవడం వల్ల అనేక హానికరమై ప్రభావాలు వస్తాయంటున్నారు నిపుణులు. స్నానం చేయకపోవడం వల్ల కొన్ని రకాల సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు. సాధారణంగా మన ఇంటిని రోజూ ఊడ్చుకోకపోతే.. ఎలా దుర్వాసన వచ్చి, చికాకుగా అనిపిస్తుందో.. మనం స్నానం చేయకపోతే అంతే దుర్వాసన రావడంతో పాటు ఎలర్జీ వచ్చే అవకాశం ఎక్కువుగా ఉంటుంది.

ఇన్ఫెక్షన్స్

శీతాకాలంలో స్నానం చేయకపోతే మృతకణాలు ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా గజ్జ ప్రాంతంలో. ఈ మృతకణాలు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి. ఇవి శరీరంలోని ఇతర భాగాలకు మరింత వ్యాప్తి చెందుతాయి. స్నానం మానేయడం వల్ల శరీరంలోని వివిధ భాగాలలో మృతకణాలు బాగా పేరుకుపోయి.. మరిన్ని ఇన్ఫెక్షన్లకు దారి తీస్తాయి.

దుర్వాసన

స్నానం చేయకుండా బద్ధకించడం వల్ల బాక్టీరియా శరీరం అంతటా వ్యాప్తి చెంది, దుర్వాసనను పెంచుతుంది. ఇది అసహ్యకరమైన వాసనతో పాటు.. వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.

ఇవి కూడా చదవండి

రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది

స్నానం చేయకపోవడం వలన శరీరంలో ఉండే వైరస్, బ్యాక్టీరియా ఎక్కువుగా వృద్ధి చెందుతాయి. ఇది శరీరంలోని రోగనిరోధక శక్తిని మరింత తగ్గించి ఇన్ఫెక్షన్లకు గురి చేస్తాయి.

జుట్టు ఊడిపోవడం

శీతాకాలం, వర్షాకాలంలో హెయిర్ లాస్ ఎక్కువగానే ఉంటుంది. వారానికి కనీసం ఒకసారి నుంచి రెండు సార్లు తలస్నానం కూడా చేయాలి. లేదంటే జట్టు ఎక్కువుగా ఊడిపోతుంది. స్కాల్ప్​పై దురద వంటి సమస్యలు వస్తాయి. ఇవి హెయిర్ లాస్​సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

చర్మ సంబంధిత సమస్యలు

స్నానం చేయడం వల్ల చర్మానికి ఉపశమనం కలుగుతుంది. స్నానం మానేస్తే.. చర్మవ్యాధులు, సీజనల్ వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. ఒక్కోసారి ఇది తీవ్రమైన చర్మ వ్యాధులకు దారి తీస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..