Dosa For Weight Loss: దోశతో వెయిట్ లాస్ అవ్వొచ్చన్న విషయం మీకు తెలుసా?

దోశ అంటే ఇష్టముండని వారుండరు. దోశలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పడం చాలా కష్టం. ఇది చాలా పాపులర్ ఐటెమ్. భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా దోశ అనేది కామన్ గా దొరుకుతుంది. అంతే కాకుండా దోశకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఇంత టేస్టీగా ఉండే దోశ తిని కూడా బరువు తగ్గొచ్చన్న విషయం మీకు తెలుసా.. ఏంటి? ఆశ్చర్య పోతున్నారా ఇది నిజమే.. దోశ తింటూ కూడా హ్యాపీగా బరువు తగ్గొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు.. ఎలాంటి డౌట్స్ లేకుండా దోశను తమ డైట్ లో..

Dosa For Weight Loss: దోశతో వెయిట్ లాస్ అవ్వొచ్చన్న విషయం మీకు తెలుసా?
Dosa For Weight Loss

Edited By: Ram Naramaneni

Updated on: Dec 04, 2023 | 8:21 PM

దోశ అంటే ఇష్టముండని వారుండరు. దోశలో ఎన్ని రకాలు ఉన్నాయో చెప్పడం చాలా కష్టం. ఇది చాలా పాపులర్ ఐటెమ్. భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా దోశ అనేది కామన్ గా దొరుకుతుంది. అంతే కాకుండా దోశకు ఫ్యాన్స్ కూడా ఎక్కువే. ఇంత టేస్టీగా ఉండే దోశ తిని కూడా బరువు తగ్గొచ్చన్న విషయం మీకు తెలుసా.. ఏంటి? ఆశ్చర్య పోతున్నారా ఇది నిజమే.. దోశ తింటూ కూడా హ్యాపీగా బరువు తగ్గొచ్చు. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు.. ఎలాంటి డౌట్స్ లేకుండా దోశను తమ డైట్ లో చేర్చు కోవచ్చు. మరి దోశతో ఎలా బరువు తగ్గుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

కేలరీలు తక్కువ:

దోశలో క్యాలరీలు అనేది తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు కేలరీలు తక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ఎలాంటి సందేహం లేకుండా దోశను తీసుకోవచ్చు.

గ్లూటెన్ రహితంగా ఉంటుంది:

దోశలు అనేవి బియ్యం, మినపప్పుతో తయారు చేసేవి కాబట్టి.. గ్లూటెన్ సెన్సిటివిటీ ఉన్నవారికి నేచురల్ గా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. అయితే ఇది లైట్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ప్రోటీన్ ఉంటుంది:

దోశ అనేది పిండి పదార్థం కాబట్టి.. ప్రోటీన్ మెండుగా ఉంటుంది. వెయిట్ లాస్ అయ్యే క్రమంలో కండరాల బలాన్ని కాపాడేందుకు ప్రోటీన్ సహాయ పడుతుంది.

జీర్ణ వ్యవస్థకు మంచిది:

దోశ అనేది పిండి పదార్థాం కాబట్టి ఇందులో.. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్ అనేది జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరిగేందుకు హెల్ప్ చేస్తుంది. అలాగే దోశ అనేది సులువగా జీర్ణం అయ్యే పదార్థం. దోశలో ఉండే ఫైబర్, ప్రోటీన్ ల కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. ఆకలి కూడా ఎక్కువగా వేయదు. కాబట్టి ఈ రకంగా కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చు.

ప్లెయిన్ దోశ బెస్ట్:

దోశ అనేది చేసే దాని బట్టి క్యాలరీస్ అనేవి ఆధార పడి ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ లో పిజ్జా దోశ, చీజ్ దోశ లాంటివి కూడా ఉంటాయి. వీటిని తింటే బరువు తగ్గరు. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారు.. ఆయిల్ తక్కువగా ఉపయోగించి.. ప్లెయిన్ దోశ తింటే మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.