Health: శరీరంలో ఈ లోపం డిప్రెషన్‌కు దారి తీస్తుంది.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతులు..

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని సవ్యంగా ఉండాలి. ఏమాత్రం తేడా కొట్టినా వెంటనే రియాక్షన్‌ కనిపిస్తుంది. ముఖ్యంగా మనిషి ఆరోగ్యంగా ఉండడంలో హార్మోన్లది ముఖ్యపాత్ర. ఏ హార్మోన్‌ లోపం ఉన్నా వెంటనే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి వాటిలో ఒకటి ఐరన్‌. ఇటీవల చాలా మంది మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్‌...

Health: శరీరంలో ఈ లోపం డిప్రెషన్‌కు దారి తీస్తుంది.. జాగ్రత్త పడకపోతే అంతే సంగతులు..
Health
Follow us

|

Updated on: Dec 31, 2022 | 12:25 PM

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో అన్ని సవ్యంగా ఉండాలి. ఏమాత్రం తేడా కొట్టినా వెంటనే రియాక్షన్‌ కనిపిస్తుంది. ముఖ్యంగా మనిషి ఆరోగ్యంగా ఉండడంలో హార్మోన్లది ముఖ్యపాత్ర. ఏ హార్మోన్‌ లోపం ఉన్నా వెంటనే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి వాటిలో ఒకటి ఐరన్‌. ఇటీవల చాలా మంది మహిళలు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో హిమోగ్లోబిన్‌ తయారీకి ఎంతో ముఖ్యమైన ఐరన్‌ లోపిస్తే డిప్రెషన్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉందని మీలో ఎంత మందికి తెలుసు.? కొన్ని నివేదికల ప్రకారం ఐరన్‌, విటమిన్‌ బీ12 లోపం మానసిక సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నాయి. ఇంతకీ ఐరన్‌ లోపం వల్ల కలిగే మరికొన్ని అనారోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఐరన్‌లోపం డిప్రెషన్‌ వంటి సమస్యలకు కూడా దారితీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమస్య కారణంగా విచారం, హైపర్‌ టెన్షన్‌, కండరాలలో బలహీనత, మానసికంగా త్వరగా అలసిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్‌ బీ12 లోపం ఉన్నా కూడా ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి.

* శరీరంలో ఐరన్‌ లోపం వల్ల రక్త హీనత ఏర్పడుతుంది. దీంతో తీవ్రంగా అలసిపోతుంటారు. ఐరన్ లోపం వల్ల ఎర్ర రక్తకణాలు సరిగా ఉత్పత్తి కావు ఇది రక్తహీనతకు దారితీస్తుంది. నివేదికల ప్రకారం పురుషులతో పోల్చితే మహిళల్లో రక్త హీనత ఎక్కువని తేలింది.

ఇవి కూడా చదవండి

* ఐరన్‌ లోపం వల్ల మానసిక సమస్యలు సైతం వేధిస్తుంటాయి. దీంతో మానసిక ప్రవర్తనలో మార్పులు కనిపిస్తాయి. ఆందోళన, నిరాశ వంటి సమస్యలు ఆవహిస్తుంటాయి. మెదడు డమ్‌గా మారుతుంది.

* శరీరంలో ఐరన్‌ లోపం ఏర్పడితే ఎముకలకు సంబంధించిన వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలో సరిపడ ఐరన్‌ లేకపోతే వెన్ను నొప్పి వంటి సమస్యలు వేధిస్తుంటాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు ప్రాథమిక సమాచారం మేరకు అందించినది మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్య నిపుణుల సూచనలే తుది నిర్ణయంగా భావించాలి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..